Saraswati Pushkaram: తెలంగాణ రాష్ట్రంలో పుష్కరాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. మే 15 తేదీ 2025 నుంచి తెలంగాణ రాష్ట్రంలో సరస్వతి పుష్కరాలు జరుగనున్నాయి. ఈ తరుణంలోనే సరస్వతి పుష్కరాలు వెబ్‌సైట్ లాంఛ్ చేశారు. సరస్వతి పుష్కర్ – 2025 – 2025)వెబ్ పోర్టల్ , మొబైల్ యాప్ ను తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ ప్రారంభించారు. మే 15వ తేదీ 2025 నుంచి 26 మే 2025 వరకు తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో పుష్కరాలు జరుగనున్నాయి.

పవిత్రమైన పండగే ఈ పుష్కరాలు
సరస్వతి పుష్కరాలు అనేవి… ప్రతి 12 సంవత్సరాలకు ఒక సారి జరుగుతాయి. సరస్వతి నదికి సంబంధించిన పవిత్రమైన పండగే ఈ పుష్కరాలు. ఈ పుష్కరాలు సాధారణంగా గృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి… దాదాపు 12 రోజుల పాటు జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం 2025 సరస్వతి పుష్కరాలు… మే 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు కొనసాగుతాయి.
ఇప్పటికే 25 కోట్ల రూపాయల నిధులను మంజూరు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలో ఈ పుష్కరాలు జరగబోతున్నాయి. ఈ సరస్వతి పుష్కరాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 25 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. ఈ పుష్కరాలకు సంబంధించిన పనులు కూడా చక చకా జరుగుతున్నాయి. ఈ పుష్కరాలకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. ఇందులో భాగంగానే ఇవాళ వెబ్ సైట్ కూడా లాంచ్ చేశారు.
Read Also: భూరికార్డుల్లో తప్పుల సవరణకు ఏడాది ఛాన్స్