పంజాబ్‌కు చెందిన ప్రముఖ సింగర్ (Punjabi Singer) సునందా శర్మ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. తన కారుపై అగ్నాత దుండగులు దాడి చేసిన ఘటన. విదేశీ పర్యటనలో ఉన్న ప్రముఖ భారతీయ గాయనికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆమె కారుపై దుండగులు దాడి చేశారు (Car Vandalised). అద్దాలను ధ్వంసం చేసి అందులోని విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఈ విషయాన్ని ఆ గాయని స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

లక్షల విలువైన బ్యాగులు, సూట్‌కేస్ మాయం
పంజాబ్‌కు చెందిన ప్రముఖ సింగర్ (Punjabi Singer) సునందా శర్మ (Sunanda Sharma).. లండన్ వెళ్లారు. అక్కడ పార్కింగ్ స్థలంలో ఆమె ఖరీదైన జాగ్వార్ కారుపై దుండగులు దాడి చేశారు. అద్దాలు ధ్వంసం చేసి అందులోని ఖరీదైన హ్యాండ్ బ్యాగ్‌లు (Luxury Bags Stolen), సూట్ కేస్ దోచుకెళ్లారు. పని ముగించుకొని కారు వద్దకు వచ్చిన సునంద అక్కడ పరిస్థితి చూసి ఒక్కసారిగా షాకైంది. ఈ మేరకు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. తాను కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఇష్టపడి కొనుక్కున్న రెండు లూయిస్ విట్టన్ బ్యాగులు, ఒక సూట్‌కేస్, మరో హ్యాండ్ బ్యాగ్‌ను దుండగులు దోచుకెళ్లినట్లు తెలిపింది. ‘అవి నాకు ఎంతో ఇష్టమైనవి.. అన్నీ పోయాయి’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. కాగా, సునంద.. ‘జాట్ యమ్లా’, ‘జానీ తేరా నా’, ‘పాగల్ నహీ హోనా’, ‘చోర్రీ చోర్రీ’ వంటి పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఘటనతో విదేశాల్లో ప్రయాణిస్తున్న సెలబ్రిటీల భద్రతపై చర్చ. తాత్కాలికంగా కాని, కలత కలిగించే సంఘటనగా అభిప్రాయాలు.