IPL2025:క్షమాపణ చెప్పిన పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఎందుకంటే!

IPL2025:క్షమాపణ చెప్పిన పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌..ఎందుకంటే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ తన తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన కనబరిచారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌పై జరిగిన ఈ మ్యాచ్‌లో, అయ్యర్ 42 బంతుల్లో 97 పరుగులతో అజేయంగా నిలిచి, తన జట్టును 11 పరుగుల తేడాతో విజయానికి నడిపించారు.

11వ ఓవర్‌

ఓపెనింగ్‌ పార్ట్నర్‌షిప్‌తో పాటు.. బట్లర్‌తో కలిసి కీలక పార్ట్నర్‌షిప్‌ను నెలకొల్పాడు. మొత్తంగా 41 బంతుల్లో 74 పరుగులు చేసి అదరగొట్టాడు. అయితే డేంజరస్‌గా ఆడుతున్న సాయి సుదర్శన్‌ను ముందుగానే అవుట్‌ చేసే ఛాన్స్‌ వచ్చింది. కానీ, కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ నేలపాలు చేశాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్‌ ఐదో బంతికి సాయి సుదర్శన్‌ కవర్స్‌ పై నుంచి షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. సర్కిల్‌ లోపల ఉన్న కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు కాస్త పై నుంచి ఆ బాల్‌ వెళ్తోంది. అది అందుకోవడానికి అయ్యర్‌ గాల్లోకి కాస్త ఎగిరి పట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ, బాల్‌ చేతుల్లో పడి మిస్‌ అయ్యింది. నిజానికి ఇంకాస్త మంచి ఎఫర్ట్‌ పెట్టి, రైట్‌ టైమ్‌లో జంప్‌ చేసి ఉంటే ఆ బాల్‌ అయ్యర్‌ అందుకునే వాడు. మంచి ఫీల్డర్‌గా పేరున్న అయ్యర్‌ స్టాండర్డ్స్ అది కచ్చితంగా అందుకోవాల్సిన క్యాచ్‌.

మ్యాక్స్‌వెల్‌కు సారీ

ఈ క్యాచ్‌ డ్రాప్‌ తర్వాత అయ్యర్‌ తన టీమ్‌మేట్‌ కు సారీ చెప్పాడు. ఎందుకంటే.. ఆ ఓవర్‌ వేసింది మ్యాక్స్‌వెల్‌ కాబట్టి. అప్పటికే ఒక వికెట్‌ తీసి మంచి జోష్‌లో ఉన్న మ్యాక్సీ ఆల్‌మోస్ట్‌ రెండో వికెట్‌ తీసేశాడు.. కానీ, అయ్యర్‌ పట్టి ఉంటే ఆ రెండో వికెట్‌ వచ్చేది. కానీ, మిస్‌ అయ్యింది. దీంతో అయ్యర్‌, మ్యాక్సీకి వెంటనే సారీ చెప్పాడు. ఇది స్పోర్ట్స్‌మెన్‌ స్పిరిట్‌ అంటూ క్రికెట్‌ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 243/5 స్కోర్ చేసింది, ప్రధానంగా అయ్యర్ అద్భుత బ్యాటింగ్‌ కారణంగా. గుజరాత్ టైటాన్స్ 232/5 స్కోర్ చేసి, 11 పరుగుల తేడాతో ఓటమి చవిచూశారు. ​ఈ విజయంతో, శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా తన ప్రస్థానాన్ని విజయవంతంగా ప్రారంభించారు. అయినప్పటికీ, ఫీల్డింగ్‌లో మెరుగుదల అవసరమని ఈ సంఘటన సూచిస్తుంది.

Related Posts
Emerging Teams Asia Cup: తిల‌క్ వ‌ర్మ‌కు కెప్టెన్సీ ఛాన్స్‌
Tilak Varma 2023

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఈ నెల 18 నుంచి ఒమన్‌లో ప్రారంభం కానున్న ఎమర్జింగ్ ఆసియా కప్-2024 కోసం 15 మంది సభ్యులతో కూడిన Read more

క్షీణించిన ప్రశాంత్ కిషోర్ ఆరోగ్యం
క్షీణించిన ప్రశాంత్ కిషోర్ ఆరోగ్యం

బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బిపిఎస్సి) అభ్యర్థులకు మద్దతు ఇవ్వడానికి జనవరి 2 న ప్రారంభించిన నిరాహార దీక్షలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆరోగ్యం క్షీణించడంతో Read more

PF money: రెండు నిమిషాల్లో మీ పీఎఫ్ డబ్బులు నేరుగా అకౌంట్లోకి..
రెండు నిమిషాల్లో మీ పీఎఫ్ డబ్బులు నేరుగా అకౌంట్లోకి..

ప్రతి నెల ఉద్యోగి జీతం నుండి కొంత మొత్తం ఈపీఎఫ్ఒకి కట్ వుతుంటుంది, దీనిని మీరు మర్చిపోయిన భవిష్యత్తులో మీకు డబ్బు అవసరమైనపుడు చాల ఉపయోగపడుతుంది. మీరు Read more

దుష్ప్రవర్తన కారణంగా కోహ్లీకి నిషేధం?
దుష్ప్రవర్తన కారణంగా కోహ్లీకి నిషేధం?

సామ్ కాన్‌స్టాస్ తో దుష్ప్రవర్తన కారణంగా కోహ్లీకి నిషేధం? వచ్చే అవకాశముందా బాక్సింగ్ డే టెస్ట్ మొదటి రోజు ఆసక్తికరమైన ఘటనా సంఘటనలో భారత క్రికెట్ జట్టు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *