మహారాష్ట్రలోని పుణె (Pune Accident) జిల్లాలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదం ప్రాణాంతకంగా మారింది. భక్తులతో వెళ్తున్న పికప్ వాహనం అదుపు తప్పి లోయలో పడటంతో ఏడుగురు మహిళలు (Seven womens) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

కుందేశ్వర్ శివాలయానికి బయలుదేరిన భక్తులు
పుణె (Pune Accident) జిల్లాలోని ఖేడ్ తాలూకాలోని పాపల్‌వాడి గ్రామానికి చెందిన భక్తులు కుందేశ్వర్ శివాలయానికి దర్శనార్థం పికప్ ట్రక్కులో ప్రయాణం ప్రారంభించారు. ఈ ప్రయాణంలో వారు ఘాట్ రోడ్డులోకి వచ్చేటప్పుడు వాహనం అకస్మాత్తుగా అదుపు తప్పి లోయలో పడిపోయింది.
ఏడుగురు మహిళల మృతి, పలువురికి గాయాలు
వాహనం దాదాపు 25 నుంచి 30 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే ఏడుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. చిన్నారులతో సహా సుమారు 25–35 మంది వరకు గాయపడినట్లు అధికారులు తెలిపారు. కొందరి పరిస్థితి విషమంగా (Some people critical condition) ఉన్నట్లు సమాచారం.
సహాయక చర్యలు – ఆసుపత్రులకు తరలింపు
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు ప్రారంభించారు. అనంతరం పోలీసు బృందాలు, అత్యవసర సేవల సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని గాయపడినవారిని సమీపంలోని పాఠ్ గ్రామీణ ఆసుపత్రికి, ఇతర ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు.
ప్రధానమంత్రి స్పందన
ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని కార్యాలయం (PMO) ద్వారా విడుదలైన ప్రకటనలో, మృతుల కుటుంబాలకు ₹2 లక్షలు, గాయపడిన వారికి ₹50 వేల చొప్పున ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ (PMNRF) నుంచి ఎక్స్‌గ్రేషియా సహాయం ప్రకటించారు.
ప్రమాదానికి గల అసలు కారణాలపై ఖేడ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వాహనం ఎలా అదుపు తప్పింది? డ్రైవర్ గమనశీలత లోపించిందా? లేక వాహన లోపమా? అనే కోణాల్లో విచారణ జరుగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: