Telangana : పొట్టి శ్రీరాములు పేరు తొలగింపు పై కొనసాగుతున్న ప్రజాగ్రహం

Telangana : పొట్టి శ్రీరాములు పేరు తొలగింపు పై కొనసాగుతున్న ప్రజాగ్రహం

హైదరాబాద్‌లోని తెలుగు యూనివర్సిటీకి ఉన్న పొట్టి శ్రీరాములు పేరును తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పొట్టి శ్రీరాములు గొప్ప దేశభక్తుడు, తెలుగు ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు. అలాంటి వ్యక్తి పేరును యూనివర్సిటీ నుంచి తొలగించడం వివాదాస్పదంగా మారింది.తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఈ నిర్ణయాన్ని తీసుకోవడంతో విపక్షాలు, విద్యావేత్తలు, సామాజిక సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

పేరు మార్పు

తెలుగు విశ్వవిద్యాలయం చట్టానికి సవరణ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మార్చి 15న అసెంబ్లీలో బిల్లు కూడా ప్రవేశపెట్టగా మంత్రి మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. గత సెప్టెంబరు 20న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సురవరం పేరు పెట్టాలని నిర్ణయించగా ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేశారు. పదో షెడ్యూల్‌లో ఈ వర్సిటీ ఉండటంతో ఇప్పటివరకు పేరు మార్చలేదు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి కేవలం తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఈ యూనివర్సిటీలో ప్రవేశాలను పరిమితం చేశారు. దీంతో 1985 డిసెంబరు 2న స్థాపించిన తెలుగు యూనివర్సిటీ పేరును ప్రభుత్వం మార్చింది.

పలువురు ఆగ్రహం

తెలుగు యూనివర్సిటీకి ఉన్న పొట్టి శ్రీరాములు పేరును తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌లోని శ్రీరాములు జయంతి సందర్భంగా కేంద్ర బండి సంజయ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు గొప్ప దేశభక్తుడు. అలాంటి మహనీయుని పేరును తొలగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సురవరం ప్రతాప్‌రెడ్డి అంటే మాకు గౌరవం ఉంది. ఆయన తెలుగు భాష ఉన్నతికి కృషి చేశారు. తెలుగు భాషాభివృద్ధి కార్యక్రమాలకు ఆయన పేరును జరిపితే బాగుంటుంది. కానీ వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించడం ఆయనను అవమానించడం అవుతుంది. ఆంధ్రా మూలాలు ఉన్న పొట్టి శ్రీరాములు పేరును తొలగించిన కాంగ్రెస్‌ సర్కారు ఎన్టీఆర్‌ పార్కు, కాసు బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవరెడ్డి పార్కుల పేర్లను, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం పేరును మార్చగలదా? అంటూ ప్రశ్నించారు. 

telugu

అభ్యంతరాలు వ్యక్తం

రేవంత్ ప్రభుత్వం తమ తప్పిదాన్ని సరిదిద్దుకొని తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించడంపై ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ బండి సంజయ్‌కు వినతిపత్రం అందజేశారు.

ఇంతకీ ఎవరీ సురంవరం

రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడుకు చెందిన సురవరం ప్రతాపరెడ్డి 1896 మే 28న జన్మించారు. మద్రాస్‌ ప్రెసిడెన్సీ కాలేజీలో న్యాయవాద విద్య అభ్యసించిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. 1952లో వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా హైదరాబాద్‌ స్టేట్‌ శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఏడాదే 1953 ఆగస్టు 25న ఆయన మృతి చెందారు. ఆయన రచించిన ఆంధ్రుల సాంఘిక చరిత్రకు 1955లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది.

Related Posts
KTR : ఇందిరమ్మ రాజ్యం రైతులపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
KTR ఇందిరమ్మ రాజ్యం రైతులపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

KTR : ఇందిరమ్మ రాజ్యం రైతులపై కేటీఆర్ తీవ్ర విమర్శలు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చామంటూ కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఇదే ఇందిరమ్మ పాలన Read more

బ‌డ్జెట్‌పై జీవీ రెడ్డి ప్ర‌శంస‌లు
బ‌డ్జెట్‌పై జీవీ రెడ్డి ప్ర‌శంస‌లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌పై ఏపీ ఫైబర్‌నెట్ మాజీ ఛైర్మన్ జీవీ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అతి తక్కువ రెవెన్యూ Read more

పుష్ప 2 తొక్కిసలాట: మానవ హక్కుల జోక్యం
పుష్ప 2 తొక్కిసలాట: మానవ హక్కుల జోక్యం

తెలంగాణ హైకోర్టులో రామారావు ఇమ్మనేని అనే న్యాయవాది దాఖలు చేసిన ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) పుష్ప 2: సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట కేసు Read more

ఉగాండాలో భారీ వర్షాలు : 15 మంది మృతి, 100 మంది గాయపడ్డారు
uganda floods

ఉగాండాలో నవంబర్ 27, 2024న భారీ వర్షాలు ఒక పెద్ద విపత్తుకు కారణమయ్యాయి. ఉగాండా యొక్క తూర్పు ప్రాంతంలో బులాంబులి జిల్లాలో భారీ వర్షాల కారణంగా భూమి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *