Public examinations in the first year continues as usul

ఏపీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు యథాతథం ..

అమరావతి: ఏపీలో ఇంటర్మీడియట్‌ విద్యలో ప్రతిపాదిత సంస్కరణలపై వచ్చిన సూచనల మేరకు వచ్చే ఏడాది నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్టీ) సిలబస్‌ అమలు, పరీక్షల నిర్వహణ, అంతర్గత మార్కుల విధానం లాంటి పలు ప్రతిపాదనలను ఇటీవల ఇంటర్మీడియట్‌ విద్యామండలి ప్రకటించింది. ఈ ప్రతిపాదనలపై ఈ నెల 26 వరకు సలహాలు, సూచనలు స్వీకరించింది. ఈ సూచనల మేరకు ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

image

ఎగ్జామ్స్ నిర్వహించకపోతే విద్యార్థులు చదువుపై దృష్టిపెట్టరని, అభ్యసన సామర్థ్యాలు తగ్గిపోతాయని లాంటి పలు సూచనలు వచ్చాయి. అంతర్గత మార్కుల విధానం ప్రతిపాదనలను విరమించుకోనుంది. ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ అమలు చేస్తూ ప్రస్తుతం ఉన్న విధానంలోనే ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. గణితంలో ఏ, బీ పేపర్లు ఉండవు. రెండింటిని కలిపి ఒకే పేపర్‌గా ఇస్తారు. వృక్ష, జంతు శాస్త్రాలు కలిపి జీవశాస్త్రంగా ఒకే పేపర్‌ ఉంటుంది. రెండు భాష సబ్జెక్టుల్లో ఇంగ్లిష్ తప్పనిసరిగా ఉంటుంది. మరో భాష సబ్జెక్టును విద్యార్థులు ఐచ్ఛికంగా ఎంపిక చేసుకోవచ్చు. వీటిపై త్వరలో ఇంటర్మీడియట్‌ విద్యామండలి సమావేశం నిర్వహించి తీర్మానాలు చేయనున్నారు.

Related Posts
జామా మసీదు పై ఒవైసీ ఆగ్రహం
జామా మసీదు పై ఒవైసీ ఆగ్రహం

సంభాల్‌లో జామా మసీదు వద్ద నిర్మాణంలో ఉన్న కొత్త పోలీస్ అవుట్‌పోస్ట్‌పై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు చేశారు. Read more

ఎదురు కాల్పులు.. 8 మంది మావోయిస్టులు మృతి
Massive encounter in Chhattisgarh... 8 Maoists killed

ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. బీజాపూర్‌ జిల్లా గంగులూర్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి Read more

కేజ్రీవాల్‌ కేసు..ఈడీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
11 1

న్యూఢిల్లీ: ఆప్‌ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కి ఢిల్లీ హైకోర్టు నోటీసులిచ్చింది. ఎక్సైజ్‌ పాలసీ కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్‌ కేసులో తనపై Read more

ఏపీకి తుఫాను ముప్పు.. మూడు రోజులు భారీ వర్షాలు
rain ap

రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏపీని వర్షాలు వణికిస్తున్నాయి. వరుస తుపానుల ప్రభావంతో ఇటీవల వరకు రాష్ట్రంలోని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *