ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దేశ రక్షణలో సేవలందిస్తున్న సైనికులకు గౌరవంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల తన అధికారిక ‘X’ (మాజీ ట్విట్టర్) ఖాతాలో ఈ విషయాన్ని ప్రకటించారు. రాష్ట్రం నుంచి భారత రక్షణ దళాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఆస్తి పన్ను మినహాయింపు కల్పించనున్నట్లు వెల్లడించారు.
ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, పారామిలిటరీ, సీఆర్పీఎఫ్ సిబ్బంది మినహాయింపు
ఈ మినహాయింపు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, పారామిలిటరీ, సీఆర్పీఎఫ్ సిబ్బందికి వర్తించనుంది. వీరి భాగస్వామి లేదా వారితో కలసి సంయుక్తంగా కలిగిన ఇంటిపై పంచాయతీ పరిధిలో ఉంటే ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఈ విధానం విధించటంతో డ్యూటీలో ఉన్న రక్షణ సిబ్బంది కుటుంబాలకు ఆర్థికంగా కొంత ఊరట లభించనుంది.
పదవీ విరమణ చేసిన రక్షణ సిబ్బందికి మాత్రమే
ఇప్పటివరకు ఈ సౌకర్యం ప్రధానంగా సరిహద్దుల్లో పనిచేసే లేదా పదవీ విరమణ చేసిన రక్షణ సిబ్బందికి మాత్రమే పరిమితమై ఉండేది. అయితే ఇప్పుడు అధికారిక విధుల్లో ఉండే వారికి కూడా ఈ ప్రయోజనం అందుబాటులోకి రావడం శుభపరిణామంగా భావించబడుతోంది. ఈ నిర్ణయం దేశ రక్షణలో నిబద్ధంగా ఉన్న జవాన్లకు రాష్ట్రం తరఫున గౌరవంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read Also : AP : ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా రాయపాటి శైలజ