UttaraPradesh :వెలుగులోకి కీచక ప్రొఫెసర్ దారుణాలు

UttaraPradesh :వెలుగులోకి కీచక ప్రొఫెసర్ దారుణాలు

ఉత్తర్ ప్రదేశ్ హథ్రాస్‌లోని సేఠ్ ఫూల్‌ చంద్‌ బాగ్లా పీజీ కాలేజీలో జియాలజీ ప్రొఫెసర్ రజనీష్ కుమార్ (50) విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసు వెలుగు చూసింది. దాదాపు రెండు దశాబ్దాలుగా విద్యార్థినులను టార్గెట్ చేస్తూ, వీడియోలు రికార్డు చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

పరారీ లో ఉన్న నిందితుడు

పరారీలో ఉన్న అతడి కోసం గాలింపు చేపట్టి,ప్రయాగ్‌రాజ్‌లో గురువారం అదుపులోకి తీసుకున్నారు.వివరాల్లోకి వెళ్లే,హథ్రాస్‌లోని సేఠ్ ఫూల్‌ చంద్‌ బాగ్లా పీజీ కాలేజీ చీఫ్‌ ప్రొక్టర్‌ రజనీష్‌ కుమార్‌,విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడి, వీడియోలు తీస్తూ వారిని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో నిందితుడు పరారయ్యాడు.

ప్రత్యేక బృందాలు

దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చెశారు.అతడికోసం గాలింపు చేపట్టారు. చివరకు ప్రయాగ్‌రాజ్‌లో పోలీసులకు చిక్కాడు. కానీ, ఎంత మందిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో తనకు తెలియదని నిందితుడు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.2009లో ఒక విద్యార్థినిపై లైంగిక దాడి చేయగ అనుకోకుండా అది వెబ్‌కెమెరాలో రికార్డు అయ్యిందని చెప్పాడు. దీంతో అప్పుడే వీడియోలను రికార్డు చేసి వారిని బ్లాక్‌మెయిల్‌ చేయాలన్న ఆలోచన వచ్చినట్టు వెల్లడించాడు. కొన్నేళ్ల కిందట నుంచే వాటిని రికార్డు చేయడం ప్రారంభించానని విచారణలో బయటపెట్టిన సమాచారం.

86228165

బ్లాక్‌మెయిల్‌

వెబ్‌కెమెరాలో అనుకోకుండా రికార్డ్ కావడంతో బ్లాక్‌మెయిల్ పద్ధతిని మొదలుపెట్టాడు.అతడి కంప్యూటర్‌లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసి, విద్యార్థినులపై సీక్రెట్‌గా వీడియోలు రికార్డ్ చేస్తూ వాటిని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ .విద్యార్థినుల నుంచి పరీక్షల్లో ఎక్కువ మార్కులు వేస్తానని, ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.ప్రతిభావంతమైన విద్యార్థినులను టార్గెట్ చేసి, వారిని భయపెట్టి అఘాయిత్యాలకు పాల్పడేవాడు.

నిందితుడి ప్రొఫైల్

నిందితుడికి కుమార్‌కు 1996లో పెళ్లైనప్పటికీ ప్రస్తుతం వైవాహిక జీవితం సక్రమంగా లేదని, వారికి పిల్లలు లేరని తెలిపారు. 2001లో నిందితుడు హథ్రాస్ సేఠ్ పూల్ చంద్ బాగ్లా పీజీ కాలేజీలో లెక్చరర్‌గా చేరాడని, గతేడాది చీఫ్‌ ప్రొక్టర్‌గా ప్రమోషన్ వచ్చిందని చెప్పారు.

వీడియోలు స్వాధీనం, దర్యాప్తు

విద్యార్థినులపై అత్యాచారానికి సంబంధించి అతడి మొబైల్‌ నుంచి 65కి పైగా వీడియోలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీటిలో కొన్ని వీడియోలను పోర్న్ సైట్‌లో అప్‌లోడ్ చేసినట్టు గుర్తించామని అన్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, మరిన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు.

Related Posts
భారత్‌లో చైనా వైరస్‌ తొలి కేసు
భారత్‌లో చైనా వైరస్‌ తొలి కేసు

బెంగుళూరులో తొలి హెచ్ఎంపీవీ కేసు నమోదు. బెంగళూరులో ఎనిమిది నెలల శిశువుకు హ్యూమన్ మెటాప్యూమోవైరస్ (హెచ్ఎమ్పివి) వైరస్ ఉన్నట్లు గుర్తించారు. నివేదికల ప్రకారం, ఆ బిడ్డకు ఎటువంటి Read more

ఇక సులభంగా ట్రైన్ టికెట్స్ బుకింగ్
ఇక సులభంగా ట్రైన్ టికెట్స్ బుకింగ్

మన దేశంలో ప్రతిరోజూ ఎంతో మంది రైలులో ప్రయాణిస్తుంటారు. అయితే ప్రయాణీకులకు టికెట్ బుకింగ్ ఈజీ చేయడానికి IRCTC ఒక కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. దీని Read more

నితీశ్ కుమార్‌ను ప్రజలుఅంగీకరించరని వ్యాఖ్య
నితీశ్ కుమార్‌ను ప్రజలు అంగీకరించరని వ్యాఖ్య

ఏ కూటమిలో ఉన్నా నితీశ్ కుమార్‌ను ప్రజలు అంగీకరించరని వ్యాఖ్య బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, ముఖ్యమంత్రి నితీశ్ Read more

సెబీ మాజీ చీఫ్ మాధబి పూరీ బుచ్ పై ఏసీబీ కేసు
సెబీ మాజీ చీఫ్ మాధబి పూరీ బుచ్ పై ఏసీబీ కేసు

భారత స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ మాజీ చైర్మన్ మాధబి పూరి బుచ్ ప్రస్తుతం కొత్త చిక్కుల్లో ఇరుక్కున్నారు. గతంలో అదానీకి ఆమె సహాయం చేశారంటూ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *