AndhraPradesh: ఏప్రిల్ నుంచి అమరావతిలో వేగంగా పనులు ..

AndhraPradesh: ఏప్రిల్ నుంచి అమరావతిలో వేగంగా పనులు ..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభం అవుతుండగా, సీఎం చంద్రబాబు నాయుడు తన సొంత ఇంటి నిర్మాణానికి కూడా సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా అమరావతిలో తిరిగి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు టెండర్లు ఖరారు అయ్యాయి. ప్రపంచ బ్యాంకు, హడ్కో నుంచి రుణం మంజూరు కావడంతో పనుల ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించి ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో కొత్త ఇల్లు కట్టుకోబోతున్నారు.ఈ మేరకు ఏప్రిల్ 9న భూమి పూజ చేయనున్నారు. ఈ ఇల్లు వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల స్థలంలో నిర్మించనున్నారు.

Advertisements

కార్యాలయ సిబ్బంది

వీలైనంత త్వరగా ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. మంత్రి లోకేశ్‌ కార్యాలయ సిబ్బంది, వాస్తు నిపుణులు శుక్రవారం స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం చదును చేసే పనులు జరుగుతున్నాయి.ప్లాట్ గుండా వెళ్తున్న విద్యుత్ స్తంభాలను కూడా మారుస్తారు.

పింఛన్ల పంపిణీ

ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి వీలుగా ప్రభుత్వం శనివారమే (29వ తేదీన) బ్యాంకుల్లో నగదు జమ చేయనుంది. 30న ఉగాది, 31న రంజాన్, ఏప్రిల్‌ 1న యాన్యువల్‌ క్లోజింగ్‌ డే సందర్భంగా బ్యాంకులకు సెలవు కారణంగా పింఛనుదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే నగదు జమ చేయనుంది. ఎలాంటి జాప్యం లేకుండా శనివారమే బ్యాంకుల నుంచి సంబంధిత గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నగదు విత్‌ డ్రా చేసుకోవాలని తెలిపింది.

babu1 1579765282 1580737411 1615870394

పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

ఈరోజు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొననున్నారు. పార్టీ పతాకాన్ని చంద్రబాబు ఆవిష్కరిస్తారు. ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నివాళి అర్పించిన అనంతరం జరిగే సభలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు, పొలిట్‌బ్యూరో సభ్యులు, సీనియర్‌ నాయకులు పాల్గొంటారు.మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 1న బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. చినగంజాం మండలం చిన్న గొల్లపాలెం ఏప్రిల్‌ 1న లబ్ధిదారులకు పింఛన్‌లు పంపిణీ చేయనున్నారు. తొలుత వృద్ధులు, ఒంటరి మహిళ, దివ్యాంగులైన లబ్ధిదారులతో మాట్లాడి, వారికి పింఛన్‌ పంపిణీ చేస్తారు.పింఛన్‌ లబ్ధిదారులతో గడుపుతారు. అనంతరం ప్రజావేదిక ద్వారా ప్రజలనుద్దేశించి సభలో సీఎం ప్రసంగిస్తారన్నారు. సభ పూర్తి కాగానే ఒక గంటపాటు పార్టీ కార్యకర్తలతో సమావేశం లో పాల్గొంటారు.అనంతరం జిల్లా అధికారులతోముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు.

రిజిస్ట్రేషన్

వీలైనంత త్వరగా ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. మంత్రి లోకేశ్‌ కార్యాలయ సిబ్బంది, వాస్తు నిపుణులు శుక్రవారం స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం చదును చేసే పనులు జరుగుతున్నాయి. ఈ స్థలాన్ని నెలాఖరులో రిజిస్ట్రేషన్ చేయిస్తారు. ప్లాట్ గుండా వెళ్తున్న విద్యుత్ స్తంభాలను కూడా మారుస్తారు. మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్రస్ అమరావతిగా మారనుంది.

Related Posts
ఏపీలో కూడా కులగణన చేపట్టాలి : వైఎస్ షర్మిల
Caste census should be conducted in AP too.. YS Sharmila

అమరావతి: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శమని.. ఇదో చారిత్రాత్మక ఘట్టమని.. ఈ సర్వే యావత్ భారతవనికి దిక్సూచి అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ Read more

గుంటూరులో శ్రీ రెడ్డిపై కేసు నమోదు
srireddy

గత వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని కొంతమంది రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. తమ స్థాయిని మరచిపోయి చంద్రబాబు , పవన్ కళ్యాణ్ , లోకేష్ ఇలా ఎవర్ని Read more

నన్ను, కుమారుడిని అరెస్టు చేయవచ్చు: పేర్ని నాని
Anticipatory bail granted to Perni Nani

నన్ను, నా కుమారుడిని అరెస్టు చేయడానికి ఓ మంత్రి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని పేర్నినాని ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో Read more

అందర్నీ నవ్వుల్లో ముంచేసిన సీఎం చంద్రబాబు
babu balayya

ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా, ఆయన గౌరవార్థం నారా భువనేశ్వరి ప్రత్యేక విందు ఏర్పాటు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×