తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన నటి ప్రియాంక జైన్ (Priyanka Jain) ఇటీవల వరుస ఇంటర్వ్యూలతో వార్తల్లో నిలుస్తోంది. తన వ్యక్తిగత విషయాలను నిర్మొహమాటంగా పంచుకుంటూ అభిమానులకు మరింత దగ్గరవుతోంది. తాజాగా జబర్దస్త్ వర్ష హోస్ట్ చేస్తున్న “కిస్సిక్ టాక్ షో”కి హాజరైన ఆమె, తన బాయ్‌ఫ్రెండ్ శివ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ సీక్రెట్ చెప్పింది. శివ్ (Shiva) తన లిప్స్‌ను ఎక్కువగా ఇష్టపడతాడని బోల్డ్‌గా పేర్కొనడంతో ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సీరియల్స్‌తో మంచి గుర్తింపు
ముంబైకి చెందిన ప్రియాంక జైన్ తెలుగులో ‘అమ్మలు’, ‘మౌనరాగం’ వంటి సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగమ్మాయిలా కనిపించే ప్రియాంక, తన నటనతో పాటు అందంతో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. నటనలోనే కాకుండా, ఆమె వ్యక్తిత్వం, బోల్డ్ కామెంట్స్ కూడా అభిమానులకు బాగా నచ్చుతున్నాయి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో పాల్గొన్న తర్వాత ఆమెకు మరింత క్రేజ్ పెరిగింది. అక్కడ తన ఒరిపడిన వ్యవహార శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
త్వరలో పెళ్లి చేసుకునే ఆలోచన
ప్రస్తుతం పలు టీవీ షోలలో నటిస్తూ బిజీగా ఉన్న ప్రియాంక, శివ్‌తో రిలేషన్షిప్లో ఉన్నట్లు ఓపెన్‌గా చెబుతోంది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకునే యోచనలో ఉన్నారని సమాచారం. సినిమాల వైపూ దృష్టి సారించిన ఆమె గతంలో ‘వినరా సోదరా వీర కుమార’ మరియు ‘ఎవడు తక్కువ కాదు’ వంటి చిత్రాల్లో నటించింది. అయితే పెద్దగా సక్సెస్ రాకపోయినా, టెలివిజన్ ద్వారా అభిమానులను ఎంటర్టైన్ చేస్తూ, తాజాగా ‘ఖిలాడీ లేడీస్’ షోలో కూడా కిర్రాక్ పర్ఫామెన్స్ ఇస్తూ అలరిస్తోంది.
Read Also : June 4th : జూన్ 4న వేడుకలు జరపాలి – మనోహర్