Priyanka Gandhi Vadra entered the Lok Sabha for the first time

తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ వాద్రా

న్యూఢిల్లీ: వయనాడ్‌ ఎంపీగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రియాంకా గాంధీ ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ప్రియాంక తన తల్లి, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ, సోదరుడు, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీతో కలిసి పార్లమెంట్‌కు చేరుకున్నారు. లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ ఓం బిర్లా ఆమెతో ప్రమాణం చేయించారు. పోడియం వద్దకు వెళ్లిన ప్రియాంక.. ముందుగా తమ చేతిలో ఉన్న రాజ్యాంగ ప్రతిని చూపించిన తర్వాతే ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టిన ప్రియాంక.. చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సోనియా, రాహుల్‌తోపాటు.. ప్రియాంక పిల్లలు రైహాన్ వాద్రా, మిరయా వాద్రా కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన తల్లికి శుభాకాంక్షలు తెలిపారు.

కాగా, ఇంతకాలం పార్టీ ప్రచారాలకే పరిమితమైన ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష రాజీకాయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తన సోదరుడు రాహుల్‌ రాజీనామాతో ఖాళీ అయిన కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి రికార్డు మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. శనివారం వెలువడిన ఫలితాల్లో ఆమె 4.8 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 3.64 ఓట్లతో ఉన్న రాహుల్‌ పేరుతో ఉన అత్యధిక మెజార్టీ రికార్డును ఆమె తుడిచివేశారు.

Related Posts
నేటితో ముగియనున్న ఢిల్లీ ఎన్నికల ప్రచారం
నేటితో ముగియనున్న ఢిల్లీ ఎన్నికల ప్రచారం

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5:00 గంటలకు ముగియనుంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), భారతీయ జనతా పార్టీ (BJP), మరియు కాంగ్రెస్ Read more

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి కౌంటర్
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి కౌంటర్

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి కౌంటర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై కాంగ్రెస్ నేతల చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాష్ట్రంలో ఓట్లు, Read more

1,000 రోజుల యుద్ధం: యుక్రెయిన్, రష్యా ఆటోమేషన్ వైపు అడుగులు
rusia ukraine war scaled

రష్యా ఫిబ్రవరి 2022లో యుక్రెయిన్‌పై తన పూర్తి స్థాయి ఆక్రమణను ప్రారంభించినప్పటి నుండి 1,000 రోజులు పూర్తయ్యాయి. ఈ 1,000 రోజుల యుద్ధంలో ఎన్నో తీవ్ర సంఘటనలు Read more

శీష్‌ మహల్‌ను మ్యూజియంగా మారుస్తాం : రేఖా గుప్తా
We will convert Sheesh Mahal into a museum.. Rekha Gupta

నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టించాం, కానీ కేజ్రీవాల్.. న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఢిల్లీలో 'శీష్‌ మహల్‌' పేరు విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చిన Read more