సాకెట్ కోర్టు లాకప్‌లో గురువారం జరిగిన దారుణ హత్య ఘటన దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) సంచలనం సృష్టించింది.
సాకెట్ కోర్టు (Saket Court)లాకప్‌లో అమన్ అనే ఖైదీని(prisoner) ఇద్దరు సహచర ఖైదీలు దారుణంగా హత్య చేశారు. ఈ ముగ్గురు ఖైదీలు గతంలో తిహార్ జైలులో ఒకే జైలులో ఉన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ హత్య పాత శత్రుత్వం కారణంగా జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన జైలుశాఖ మరియు న్యాయవ్యవస్థల భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.

రెండు గ్రూపుల మధ్య వాగ్వాదం
విచారణ కోసం తీహార్ జైలు (Tihar Jail) నుంచి ఖైదీలను పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. అక్కడ లాకప్‌లో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో ఇద్దరు ఖైదీలు తోటి ఖైదీపై దాడి చేసి గొంతుకోశారు. లాకప్‌లోపల రెండు గ్రూపుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘర్షణలో అమన్ అనే ఖైదీ తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. అధికారులు వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అక్కడ మరణించినట్లు ప్రకటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను విచారిస్తున్నారు.
ఈ ఘటన జైలుశాఖ మరియు కోర్టు భద్రతా వ్యవస్థలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తాయి. ప్రస్తుతం, ఈ ఘటనలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు మరియు భద్రతా చర్యలను పునరాలోచిస్తున్నారు.
Read Also:Bangalore: బెంగళూరు ఘటన కలిచివేసిందన్న అనుష్క శర్మ, కమల్ హాసన్