Prime Minister who took holy bath at Triveni Sangam

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన ప్రధాని

ప్రయాగ్‌రాజ్ : దేశంలో జరుగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్​లో ప్రధాని మోడీ పుణ్యస్నానం ఆచరించారు. ప్రయాగ్ రాజ్‌లోని త్రివేణి సంగమంలో ప్రధాని మోడీ బుధవారం ఉదయం 11:15 గంటలకు పుణ్యస్నానం చేశారు. అంతకుముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి మోడీ యమునా నదిలో బోటు షికారు చేశారు. అరైల్‌ ఘాట్‌ నుంచి సంగం ఘాట్‌ వారకూ బోటులో ప్రయాణించారు.

అనంతరం సంగంఘాట్‌ వద్ద నదీ స్నానాలు ఆచరించి గంగమ్మకు ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా త్రివేణీ సంగమం వద్ద మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చన చేయనున్నారు. అనంతరం సాధు సంతువులతో సమావేశం కానున్నారు. మహా కుంభ్‌ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

కాగా, మహా కుంభమేళా 24వ రోజు కొనసాగుతోంది. ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. గంగ, యమున, సరస్వతి సదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమం లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 39 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుంచి ప్రముఖులు, విదేశీయులు సైతం ఆధ్యాత్మిక వేడుక మహాకుంభ మేళాలో పాల్గొన్నారు. కుంభమేళాకు హాజరై పుణ్యస్నానాలు ఆచరిస్తే దోషాలు తొలగిపోయి, అంతా మంచే జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.

Related Posts
ఉద్యోగిపై ఏసీబీ రైడ్స్.. రూ.150 కోట్ల ఆస్తుల గుర్తింపు
acb found 150 crore assets

లంచం ఇస్తే చాలు మీ పని ఐపోతుంది.. ఎక్కడ కావాలంటే అక్కడ భవనాలు నిర్మించుకునేందుకు అనుమతి లభిస్తుంది. అది బఫర్‌జోన్‌ అయినా.. ఎఫ్‌టీఎల్ అయినా లంచం ఇస్తే Read more

ఢిల్లీలో కుంభకోణానికి పాల్పడింది ఎవరో ప్రజలు గుర్తుపెట్టుకోవాలి: రాహుల్‌
People should remember who committed the scam in Delhi.. Rahul

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ఆమ్‌ ఆద్మీ పార్టీ పై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో ఈరోజు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఒకే విడతలో Read more

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
tirumala vaikunta ekadasi 2

తిరుమలలో భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రస్తుతం స్వామివారి దర్శనానికి భక్తులు సుమారు 18 Read more

దిల్ రాజు ఇంట్లో రెండో రోజు కూడా ఐటీ రైడ్స్
it rides dil raju

టాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థలపై రెండో రోజు ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. SVC నిర్మాణ సంస్థ యజమానులు దిల్ రాజు, శిరీష్, మైత్రీ మూవీ మేకర్స్ Read more