Prime Minister visits AIIMS, inquiries about Vice President health

ఎయిమ్స్‌కు వెళ్లిన ప్రధాని .. ఉపరాష్ట్రపతి ఆరోగ్యంపై ఆరా

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. జగదీప్ ధన్‌ఖడ్‌ ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

డాక్టర్‌ రాజీవ్‌ నారంగ్‌ ఆధ్వర్యంలో చికిత్స

ఆదివారం తెల్లవారు జామున 2గంటల సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో జగదీప్ ధన్‌ఖడ్‌ను ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన్ను ఎయిమ్స్‌లోని క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ (సీసీయూ)లో ఉంచి కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్‌ రాజీవ్‌ నారంగ్‌ ఆధ్వర్యంలో చికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న ప్రధాని మోడీ ఆస్పత్రికి వెళ్లి ఆరోగ్యంపై ఆరా తీశారు. మరోవైపు, ఈ ఉదయాన్నే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఆస్పత్రికి వెళ్లి ఉపరాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.

image

పశ్చిమ్ బెంగాల్ గవర్నర్‌గా పనిచేశారు

కాగా, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఉప-రాష్ట్రపతిగా 2022లో ఆయన ఎన్నికైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి మార్గరెట్ అల్వాను ఓడించి, ఆయన ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. దీనికి ముందు పశ్చిమ్ బెంగాల్ గవర్నర్‌గా పనిచేశారు. ఆ సమయంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. సీఎంవో, రాజ్‌భవన్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో ఉప్పునిప్పులా పరిస్థితి ఉండేది. ఈ వివాదంతోనే జగదీప్ ధన్‌ఖడ్‌ పేరు మీడియాకెక్కింది.

Related Posts
కేఎల్‌హెచ్‌ బాచుపల్లిలో ఏఐ అభివృద్ధి
KLH Bachupally is developing sustainability in AI

ఢిల్లీ : నేటి శక్తివంతమైన ప్రొఫెషనల్ ప్రపంచంలో రాణించడానికి అవసరమైన కీలకమైన నైపుణ్యాలు మరియు జ్ఞానంతో విద్యార్థులను సన్నద్ధం చేయడం లక్ష్యంగా KLH బాచుపల్లి క్యాంపస్ ఇటీవల Read more

‘నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే’ – జగన్ కు లోకేష్ హెచ్చరిక
1497422 lokesh

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ సీఎం జగన్, మంత్రి నారా లోకేష్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల జగన్ చేసిన వ్యాఖ్యలపై లోకేష్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా Read more

రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
uttam

రేషన్ కార్డుల జారీపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు అనవసర ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన Read more

కేటీఆర్ కు ఏసిబి నోటీసులు!
కేటీఆర్ కు ఏసిబి నోటీసులు!

ఫార్ములా-ఈ కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసిబి) కె.టీ. రామారావు (కేటీఆర్), బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కి 6 జనవరి ఉదయం 10 గంటలకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *