modi

బడ్జెట్ పై ప్రధాని మోదీ స్పందన

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. పేదలు, యువత, రైతులు, మహిళలే లక్ష్యంగా బడ్జెట్ లో పలు ప్రతిపాదనలు చేశారు నిర్మలా సీతారామన్. కేంద్ర బడ్జెట్ 2025 ప్రవేశపెట్టిన తర్వాత మొదటిసారి ప్రధాని మోదీ మాట్లాడారు. భారత అభివృద్ధి ప్రయాణంలో ఈ బడ్జెట్ ఓ మైలురాయిగా నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ” భారత్ ను అభివృద్ధి పథంలో నడపడంలో ఈ బడ్జెట్ ఓ మైలురాయిగా నిలుస్తుంది.

140కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉంది. ప్రతి భారతీయుడి కలను ఈ బడ్జెట్ నెరవేరుస్తుందని నేను ఆశిస్తున్నాను. యువత కోసం అనేక విధివిధానాలను రూపొందించను న్నాం. ఇక వికసిత్ భారత్ లక్ష్యాన్ని సామాన్య ప్రజలే నడపనున్నారు. ఇది ప్రజల బడ్జెట్. ఈ బడ్జెట్ వల్ల దేశంలో పెట్టుబడులు, ప్రజల సేవింగ్స్ అధికమవుతాయి” అని వీడియో స్టేట్ మెంట్ ద్వారా ఆయన సందేశాన్ని పంపారు. ఇక ఈ బడ్జెట్ లో వేతనజీవులకు భారీ ఉపశమనం లభించింది. వ్యక్తిగత ఆదాయ పన్ను రూ.12 లక్షల వరకు మినహాయింపు ఇస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.30వేల పరిమితితో పట్టణ పేదలకోసం యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు అందిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో పేర్కొన్నారు. విద్యా – మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇచ్చారు.

Related Posts
తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ వాద్రా
Priyanka Gandhi Vadra entered the Lok Sabha for the first time

న్యూఢిల్లీ: వయనాడ్‌ ఎంపీగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రియాంకా గాంధీ ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ప్రియాంక తన తల్లి, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ, సోదరుడు, Read more

రిజర్వేషన్ పై జమ్మూలో నిరసనలు
రిజర్వేషన్ పై జమ్మూలో నిరసనలు

రిజర్వేషన్ విధానంపై జమ్మూలో నిరసనలు, CM కుమారుడు కలకలం ఈ ఏడాది ప్రారంభంలో లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలో ప్రవేశపెట్టిన రిజర్వేషన్ విధానాన్ని సమీక్షించాలని కోరుతూ జమ్మూ & Read more

లోక్‌సభ ముందుకు జమి ఎన్నికల బిల్లు
one nation one poll to be introduced in lok sabha on december 16

న్యూఢిల్లీ: ఒకే దేశం- ఒకే ఎన్నికలు' బిల్లు ఈ నెల 16న లోక్‌సభ ముందుకు రానుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ ఈ బిల్లును లోక్‌సభలో Read more

ఆస్ట్రేలియాపై ఓటమి రోహిత్ అభిప్రాయం
ఆస్ట్రేలియాపై ఓటమి రోహిత్ అభిప్రాయం

మెల్‌బోర్న్‌లో జరిగిన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాతో 184 పరుగుల తేడాతో ఓడిపోవడం భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా నిలిచింది. ఈ పరాజయం మానసికంగా ఎంతో కష్టంగా ఉందని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *