PM Modi will visit Gujarat today and tomorrow

ఈ నెల 29న విశాఖలో పర్యటించనున్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ఈ నెల 29న విశాఖలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాక.. విశాఖ నగరంలో ప్రధాని మోడీ రోడ్ షో, బహిరంగ సభకు హాజరుకానున్నారు. ప్రధాని వస్తుండడంతో, ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. సాయంత్రం 4.30 గంటలకు ఆంధ్రా వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో మోడీ సభ ఏర్పాటు చేశారు. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఇతర ప్రాజెక్టులకు ఈ సభ నుంచి మోడీ శంకుస్థాపన చేయనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో ఈ ప్రాజెక్టుల కోసం ఇప్పటికే 1200 ఎకరాలు కేటాయించింది. గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌లో 20 గిటావాట్‌ల విద్యుత్తును ఎన్టీపీసీ ఉత్పత్తి చేయనుంది. ఈ రెండు భారీ ప్రాజెక్టుల వల్ల నాలుగేళ్లలో 48వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. అమరావతి పనులు వచ్చే నెల నుంచి ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో కేంద్ర మంత్రివర్గం అమరావతి కి 54 కిలో మీటర్ల మేర కొత్త రైల్వే లైన్ కు ఆమోదం తెలిపింది. ఈ పనుల ప్రారంభం ప్రధానితో చేయించాలని చంద్రబాబు కోరుతున్నారు.

ఇకపోతే..ఏపీకి కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి వరుస గుడ్ న్యూస్ లు అందజేస్తున్న విషయం తెలిసిందే. ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపిన మోడీ..ఆ హామీ ప్రకారం ఏపీకి అందాల్సిన నిధులు , పోలవరం ప్రాజెక్ట్ పూర్తి , పెండింగ్లో ఉన్న పనులు ఇవన్నీ త్వరగా పూర్తి అయ్యేలా దృష్టి పెట్టారు. ఇక సీఎం చంద్రబాబు సైతం కేంద్ర మంత్రులతో ఎప్పటికప్పుడు సమావేశలవుతూ వస్తున్నారు.

Related Posts
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద భారీ పేలుడు
Fireaccident

హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద పెద్ద పేలుడు సంభవించింది. నవంబర్ 11, ఆదివారం తెల్లవారుజామున తెలంగాణ స్పైసీ కిచెన్ రెస్టారెంట్ (Telangana Spicy Kitchen Restaurant)లో రిఫ్రిజిరేటర్ Read more

ఇన్ఫోసిస్ నుంచి 400 మంది ట్రైనీల తొలగింపు
ఉద్యోగులకు షాకిచ్చిన ఇన్ఫోసిస్

దేశంలో టాప్ ఐటీ కంపెనీల్లో కొన్ని మాత్రం పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది టాప్ రెండవ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ గురించే. Read more

నేటి నుంచి పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప‌నులు
Polavaram diaphragm wall construction works from today

అమరావతి: ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టులో నేడు కీలక ఘట్టం ప్రారంభం కానుంది. నీటి నిల్వకు కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ఈరోజు నుంచి Read more

బాలకృష్ణ ను ఎప్పుడు అలాగే పిలవాలనిపిస్తుంది – పవన్
Pawan announced a donation

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే బాలకృష్ణ, సీఎం చంద్రబాబు, నారా లోకేష్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *