Prime Minister Modi to visit Amravati on 15th of next month

వచ్చే నెల 15న అమరావతికి ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ వచ్చే నెల 15వ తేదీన ఏపీలో పర్యటించనున్నారు. రాజధాని పునః ప్రారంభ పనులకు హాజరుకానున్నారు. ఏపీ రాజధానితో సహా రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని చేతుల మీదుగా శ్రీకారం చుట్టేలా ప్లాన్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దీని ద్వారా మరొక్కసారి దేశం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. రాజధాని పనులు మూడేళ్లలో పూర్తి చేసేలా ప్రణాళికలు రచించింది.

Advertisements
వచ్చే నెల 15న అమరావతికి

మరోసారి పున:ప్రారంభ పనులు

40 వేల కోట్ల రూపాయల పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచింది ప్రభుత్వం. ప్రజాధనంతో రాజధానిని నిర్మించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అమరావతి స్వయం పోషక ప్రాజెక్టు అని చెప్తోంది. 2015 అక్టోబర్ 21న అమరావతికి ప్రధాని మోడీ తొలిసారి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి. తాజాగా మరోసారి పున:ప్రారంభ పనులకు తేదీని ఖరారు చేసింది చంద్రబాబు ప్రభుత్వం.

మొత్తం రూ.62,000 కోట్ల అంచనా

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునఃప్రారంభానికి సిద్దం అవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 15న అమరావతి పర్యటనలో పాల్గొని, రాజధాని నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పునఃప్రారంభం ద్వారా రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి, సీఆర్‌డీఏ (క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) ఇప్పటికే సమగ్ర ప్రణాళికను రూపొందించింది. మొత్తం రూ.62,000 కోట్ల అంచనా వ్యయంతో అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్మాణ పనులను మూడేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.

Related Posts
ఆంధ్రప్రదేశ్‌లో రూ.47,776 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్!
ఆంధ్రప్రదేశ్‌లో రూ.47,776 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) రూ. 44,776 కోట్ల పెట్టుబడులతో కూడిన 15 ప్రాజెక్టులకు గురువారం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు Read more

ఢిల్లీ పర్యటలో ముఖ్యమంత్రి చంద్రబాబు
Chief Minister Chandrababu on Delhi tour

అమరావతి: ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నిన్న(శుక్రవారం) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ , విదేశాంగ Read more

Delhi: భార్యను హతమార్చి ఆత్మహత్య చేసుకున్న భర్త..ఎందుకంటే?
Delhi: భార్యను హతమార్చి ఆత్మహత్య చేసుకున్న భర్త..ఎందుకంటే?

క్యాన్సర్ బారిన పడ్డ ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. 46 ఏళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారి కుల్దీప్ త్యాగి తన భార్య అన్షు ని కాల్చి Read more

రైల్వే ప్రయాణికులకు శుభవార్త
Bullet Train

భారతదేశంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు అనేది ఒక ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు. దీని ముఖ్య ఉద్దేశం దేశంలోని ప్రధాన నగరాలను హై-స్పీడ్ రైళ్ల ద్వారా అనుసంధానం చేయడం. దీని Read more

×