Prime Minister Modi is going to visit America.

అమెరికా పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోడీ..!

వాషింగ్ట‌న్‌: ప్ర‌ధాని మోడీ అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లనున్న సమాచారం. ఫిబ్ర‌వ‌రిలో మోడీ వైట్‌హౌజ్‌ను విజిట్ చేయ‌నున్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. దేశాధ్య‌క్షుడిగా రెండో సారి ఎన్నికైన ట్రంప్‌తో.. సోమ‌వారం ప్ర‌ధాని మోడీ ఫోన్‌లో మాట్లాడారు. ఆ ఫోన్ సంభాష‌ణ గురించి ట్రంప్ వెల్ల‌డించారు. ఫ్లోరిడాలోని జాయింట్ బేస్ ఆండ్రూస్ నుంచి ఎయిర్ ఫోర్స్ వ‌న్ విమానంలో వెళ్తున్న స‌మ‌యంలో ట్రంప్ రిపోర్ట‌ర్ల‌తో మాట్లాడారు. భార‌త ప్ర‌ధాని మోడీతో ఫోన్‌లో మాట్లాడ‌న‌ని, ఆయ‌న వైట్‌హౌజ్‌కు రానున్నార‌ని, బ‌హుశా ఫిబ్ర‌వ‌రిలో ఆయ‌న శ్వేత‌సౌధాన్ని విజిట్ చేసే ఛాన్సు ఉన్న‌ట్లు తెలిపారు. ఇండియాతో త‌మ‌కు మంచి రిలేష‌న్ ఉంద‌ని ట్రంప్ పేర్కొన్నారు.

image

ప్రధాని మోడీతో ఫోన్‌లో అన్ని అంశాల గురించి చ‌ర్చించిన‌ట్లు తెలిపారు. తొలి సారి దేశాధ్య‌క్షుడిగా చేసిన స‌మ‌యంలో.. ట్రంప్ త‌న చివ‌రి ప‌ర్య‌ట‌న ఇండియాకే వ‌చ్చారు. ఆ ఇద్ద‌రి మ‌ధ్య మంచి రిలేష‌న్ ఉన్న‌ది. 2019లో హూస్ట‌న్‌లో జ‌రిగిన ర్యాలీలో.. 2020 ఫిబ్ర‌వ‌రిలో అహ్మ‌దాబాద్‌లో జ‌రిగిన ర్యాలీలో ఇద్ద‌రూ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

కాగా, ట్రంప్‌- మోడీ ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ విజయం సాధించిన సందర్భంగా గతంలో ఆయనకు ప్రధాని మోడీ ఫోన్‌ కాల్‌లో అభినందనలు తెలియజేశారు. ఆ తర్వాత ఆయన అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు.

Related Posts
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త
TTD Tickets

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త . ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ. 300) టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విడుదల చేసింది. Read more

చరిత్రలో నిలిచిపోయే రోజు..ఈరోజు – సీఎం రేవంత్
telangana thalli cm revanth

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీఎస్‌ను 'టీజీ'గా మార్చామని , ఈ Read more

రేవంత్ రెడ్డి నిజాయితీగల మోసగాడు – కేటీఆర్
ktr

హామీలను నెరవేర్చకుండా, మోసం చేస్తున్న వ్యక్తి రేవంత్ పాలన పూర్తిగా విఫలం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు Read more

రైల్వే చట్టం సవరణ బిల్ 2024 పై ప్రతిపక్షాల అభ్యంతరాలు
railway bill

2024లో పార్లమెంటులో రైల్వే చట్టం సవరణ బిల్ 2024 పై చర్చ జరుగగా, ప్రతిపక్ష పార్టీలు దీనిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. వారు ఈ బిల్లుతో Read more