ట్రంప్‌ అధిక సుంకాన్ని విధించ‌డంపై ప్ర‌ధాని మార్క్ కార్నీ ఘాటు స్పంద‌న‌

Mark Carney: ట్రంప్‌ అధిక సుంకాన్ని విధించ‌డంపై ప్ర‌ధాని మార్క్ కార్నీ ఘాటు స్పంద‌న‌

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌… కెన‌డా ఆటో రంగంపై అధిక సుంకాన్ని విధించ‌డం ప‌ట్ల ఆ దేశ ప్ర‌ధాని మార్క్ కార్నీ ఘాటుగా స్పందించారు. అమెరికాతో పాత దోస్తీ ముగిసిందని తెలిపారు. కెనడా, అమెరికా మధ్య ఇన్నాళ్లు ఉన్న‌ ఆర్థిక, భద్రతా, సైనిక సంబంధాల యుగం ముగిసింద‌ని ప్రధాన మంత్రి గురువారం అన్నారు.
కెన‌డా నుంచి వాహనాల దిగుమతులపై ట్రంప్ 25 శాతం సుంకం విధిస్తూ ఇటీవ‌ల‌ ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. వచ్చే వారం ఇది అమల్లోకి రానుంది. ట్రంప్ నిర్ణ‌యం 5,00,000 మంది ఉద్యోగులు ఉన్న‌ కెనడియన్ ఆటో పరిశ్రమకు చేటు చేస్తుంద‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని పేర్కొన్నారు.

Advertisements
 ట్రంప్‌ అధిక సుంకాన్ని విధించ‌డంపై ప్ర‌ధాని మార్క్ కార్నీ ఘాటు స్పంద‌న‌

ట్రంప్ ఆటో సుంకాలను అన్యాయమైనది
ట్రంప్ ఆటో సుంకాలను ‘అన్యాయమైనది’ గా ఆయన అభివర్ణించారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య ఒప్పందాల ఉల్లంఘన‌గా మార్క్ కార్నీ పేర్కొన్నారు. ట్రంప్ అమెరికాతో సంబంధాలను శాశ్వతంగా మార్చేశారని, భవిష్యత్తులో ఏవైనా వాణిజ్య ఒప్పందాలు ఉన్నా తాము వెనక్కి తగ్గ‌బోమ‌ని ఆయన తెలిపారు. ఆటో సుంకాలకు వ్యతిరేకంగా కెనడా ప్రతీకారం తీర్చుకుంటుందని ప్ర‌ధాని చెప్పారు. “అమెరికాపై గరిష్ట ప్రభావాన్ని చూపే, కెనడాపై కనీస ప్రభావాన్ని చూపే మా సొంత‌ ప్రతీకార వాణిజ్య చర్యలతో మేము అగ్ర‌రాజ్యం సుంకాలను ఎదుర్కొంటాం” అని ఆయన అన్నారు.
ట్రంప్, కార్నీ ఇప్ప‌టివ‌ర‌కూ మాట్లాడుకోలేదు
కాగా, మార్చి 14న జస్టిన్ ట్రూడో స్థానంలో మార్క్‌ కార్నీ ప్రధానమంత్రిగా నియమితులైన విష‌యం తెలిసిందే. సాధారణంగా ఒక కొత్త కెనడా నాయకుడు పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే అమెరికా అధ్యక్షుడితో ఫోన్ కాల్ మాట్లాడటం ఆన‌వాయితీ. కానీ ట్రంప్, కార్నీ ఇప్ప‌టివ‌ర‌కూ మాట్లాడుకోలేదు.

Related Posts
Earthquake hits Myanmar : మయన్మార్లో మరోసారి భూకంపం
Maynmar Earthquake:మయన్మార్‌లో మళ్లీ భూకంపం..

మయన్మార్లో భూకంపం మరొకసారి ప్రజలను భయాందోళనకు గురిచేసింది. మండాలయ్ ప్రాంతానికి 13 మైళ్ల దూరంలో 5.1 తీవ్రతతో భూమి కంపించిందని అధికారులు తెలిపారు. ఈ ప్రకంపనలతో భయంతో Read more

Day In Pics: న‌వంబ‌రు 27, 2024
toda pic copy

శ్రీనగర్‌లో బుధ‌వారం జ‌రిగిన వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ 60వ జూబ్లీ వేడుకలలో పాల్గొన్న క‌ళాకారులు బుధ‌వారం లోక్‌స‌భ‌లో ప్ర‌సంగిస్తున్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలోని విజ్ఞాన్ Read more

రష్యా డ్రోన్ దాడులు: ఉక్రెయిన్ రక్షణను పరీక్షిస్తూ, కుటుంబాలను నాశనం చేస్తున్నాయి
attack

ఉక్రెయిన్ మీద రష్యా డ్రోన్ దాడులు గత కొన్ని వారాలుగా తీవ్రంగా పెరిగిపోయాయి. ఈ డ్రోన్ దాడులు, ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థలపై ఒత్తిడి పెడుతున్నాయి. అలాగే దేశంలోని Read more

జిందాల్ గ్లోబల్ లా స్కూల్ ఏఐ.బి.ఎ. ప్రోగ్రామ్‌
India's first BA in Artificial Intelligence & Law Jindal Global Law School initiated the program

హైదరాబాద్‌ : ఇంటర్ డిసిప్లినరీ విద్యలో ప్రముఖ సంస్థ అయిన జిందాల్ గ్లోబల్ లా స్కూల్ (JGLS), O.P. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ (JGU), భారతదేశంలో మొట్టమొదటి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×