ట్రంప్‌ అధిక సుంకాన్ని విధించ‌డంపై ప్ర‌ధాని మార్క్ కార్నీ ఘాటు స్పంద‌న‌

Mark Carney: ట్రంప్‌ అధిక సుంకాన్ని విధించ‌డంపై ప్ర‌ధాని మార్క్ కార్నీ ఘాటు స్పంద‌న‌

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌… కెన‌డా ఆటో రంగంపై అధిక సుంకాన్ని విధించ‌డం ప‌ట్ల ఆ దేశ ప్ర‌ధాని మార్క్ కార్నీ ఘాటుగా స్పందించారు. అమెరికాతో పాత దోస్తీ ముగిసిందని తెలిపారు. కెనడా, అమెరికా మధ్య ఇన్నాళ్లు ఉన్న‌ ఆర్థిక, భద్రతా, సైనిక సంబంధాల యుగం ముగిసింద‌ని ప్రధాన మంత్రి గురువారం అన్నారు.
కెన‌డా నుంచి వాహనాల దిగుమతులపై ట్రంప్ 25 శాతం సుంకం విధిస్తూ ఇటీవ‌ల‌ ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. వచ్చే వారం ఇది అమల్లోకి రానుంది. ట్రంప్ నిర్ణ‌యం 5,00,000 మంది ఉద్యోగులు ఉన్న‌ కెనడియన్ ఆటో పరిశ్రమకు చేటు చేస్తుంద‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని పేర్కొన్నారు.

Advertisements
 ట్రంప్‌ అధిక సుంకాన్ని విధించ‌డంపై ప్ర‌ధాని మార్క్ కార్నీ ఘాటు స్పంద‌న‌

ట్రంప్ ఆటో సుంకాలను అన్యాయమైనది
ట్రంప్ ఆటో సుంకాలను ‘అన్యాయమైనది’ గా ఆయన అభివర్ణించారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య ఒప్పందాల ఉల్లంఘన‌గా మార్క్ కార్నీ పేర్కొన్నారు. ట్రంప్ అమెరికాతో సంబంధాలను శాశ్వతంగా మార్చేశారని, భవిష్యత్తులో ఏవైనా వాణిజ్య ఒప్పందాలు ఉన్నా తాము వెనక్కి తగ్గ‌బోమ‌ని ఆయన తెలిపారు. ఆటో సుంకాలకు వ్యతిరేకంగా కెనడా ప్రతీకారం తీర్చుకుంటుందని ప్ర‌ధాని చెప్పారు. “అమెరికాపై గరిష్ట ప్రభావాన్ని చూపే, కెనడాపై కనీస ప్రభావాన్ని చూపే మా సొంత‌ ప్రతీకార వాణిజ్య చర్యలతో మేము అగ్ర‌రాజ్యం సుంకాలను ఎదుర్కొంటాం” అని ఆయన అన్నారు.
ట్రంప్, కార్నీ ఇప్ప‌టివ‌ర‌కూ మాట్లాడుకోలేదు
కాగా, మార్చి 14న జస్టిన్ ట్రూడో స్థానంలో మార్క్‌ కార్నీ ప్రధానమంత్రిగా నియమితులైన విష‌యం తెలిసిందే. సాధారణంగా ఒక కొత్త కెనడా నాయకుడు పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే అమెరికా అధ్యక్షుడితో ఫోన్ కాల్ మాట్లాడటం ఆన‌వాయితీ. కానీ ట్రంప్, కార్నీ ఇప్ప‌టివ‌ర‌కూ మాట్లాడుకోలేదు.

Related Posts
Israel :పండుగ సీజన్లో మారణహోమం.. గాజాపై ఇజ్రాయెల్ దాడులు
పండుగ సీజన్లో మారణహోమం.. గాజాపై ఇజ్రాయెల్ దాడులు

ప్రపంచమంతా రంజాన్ సీజన్లో హ్యాపీగా ఉంటే గాజాలో మాత్రం మారణహోమం జరుగుతున్నది. గాజా మిలిటెంట్ గ్రూప్ హమాస్‌పై మరోసారి విరుచుకుపడింది ఇజ్రాయెల్. కాల్పుల విరమణ ఒప్పందం అమలులో Read more

ప్రధానమంత్రి మోడీ మూడు దేశాల పర్యటన: బ్రెజిల్‌లో G20 సమ్మిట్‌లో పాల్గొననున్నారు
narendramodi

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్ 16 నుండి 21వ తేదీ వరకు మూడు దేశాల పర్యటనకు వెళ్ళిపోతున్నారు. ఈ పర్యటనలో ఆయన బ్రెజిల్‌ దేశంలోని రియో డి Read more

Trump: ట్రంప్ ప్రధాని మోదీని ఉద్దేశించి ప్రత్యేక వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క కితాబు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీని చాలా తెలివైన నేతగా ప్రశంసించారు. ట్రంప్ ప్రకారం, మోదీ Read more

ట్రంప్ ప్రతిపాదనకు పుతిన్ ఓకే
ట్రంప్ ప్రతిపాదనకు పుతిన్ ఓకే

అంతర్జాతీయ రాజకీయాలలో ఒక ముఖ్యమైన పరిణామానికి అమెరికా శ్రీకారం చుట్టింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఆర్థిక భారం పెరుగుతున్న దేశాలకు ఉపశమనం కలిగించే విధంగా అమెరికా అధ్యక్షుడు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×