droupadi murmu

పోలవరంపై బడ్జెట్ కు ముందే రాష్ట్రపతి ప్రకటన!

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కీలక ప్రసంగం చేశారు. ఉభయసభలనుద్దేశించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆమె వివరించారు. ఇందులో అభివృద్ధితో పాటు సంస్కరణల వేగం పెంచాల్సిన అవసరాన్ని ఆమె గుర్తుచేశారు. అలాగే స్వదేశీ ప్రాధాన్యంతో కేంద్రం చేపడుతున్న పలు కార్యక్రమాలను, పథకాలను వివరించారు. అదే సమయంలో ఏపీలోని పోలవరం ప్రాజెక్టునూ ఆమె ప్రస్తావించారు. ఏపీ విభజన హామీల్లో భాగంగా పోలవరంలో జాతీయ ప్రాజెక్టు నిర్మించి ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ పదేళ్లలో రెండుసార్లు కేంద్రంలో మోడీ సర్కార్ పలు మార్లు నిధులు కూడా కేటాయించింది.

అయితే మధ్యలో జరిగిన తప్పిదాలతో ప్రాజెక్టు నిర్మాణం అంతకంతకూ ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇవాళ పార్లమెంట్ ఉభయసభల నుద్దేశించి చేసిన ప్రసంగంలో పోలవరం ప్రాజెక్టును ప్రస్తావించారు. అంతే కాదు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో రాష్ట్రపతి ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉన్నట్లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన పార్లమెంట్ ప్రసంగంలో తెలిపారు.

Related Posts
గిరిజన మహిళపై దాడి.. టీడీపీకి కొలికపూడి వివరణ
tdp mla kolikapudi

తిరువూరులో ఓ గిరిజన మహిళపై దాడి చేసి అవమానించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇవాళ పార్టీ అధిష్టానానికి వివరణ ఇచ్చారు. కొలికపూడిపై వచ్చిన Read more

నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యేపై హైకమాండ్ ఆగ్రహం
Narasaraopet TDP MLA Chadal

నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో చేసిన హంగామా టీడీపీ అధిష్ఠానం దృష్టికి వెళ్లింది. తన విపరీత చేష్టలతో కార్యాలయంలో గందరగోళం సృష్టించినట్లు Read more

అటవీ విస్తీర్ణాన్ని తగ్గించవద్దు: సుప్రీం ఆదేశం
suprem court

అటవీ విస్తీర్ణాన్ని తగ్గించే ఏ పని చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అటవీ విస్తీర్ణాన్ని తగ్గించే ఏ చర్యలనైనా నిషేధిస్తున్నట్లు పేర్కొంది. అటవీ (సంరక్షణ) Read more

ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులు హతం
encounter jammu kashmir

జమ్మూకశ్మీర్ కుల్గాం జిల్లాలో గురువారం ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భారీ ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. నిఘా వర్గాల Read more