President Droupadi Murmu is coming to Hyderabad today

నేడు హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

హైదరాబాద్‌: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్‌ పర్యటనకు రానున్నారు. నేటి నుంచి రెండ్రోజుల పాటు ఆమె నగరంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొనన్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యటన సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక రాష్ట్రపతి పర్యటనకు ఎటువంటి ఇబ్బందులు తలెతకుండా పోలీసులు భద్రతా పరమైన చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో నేడు రేపు (గురు, శుక్రవారాలు) ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. పలు ప్రాంతాల్లో ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ నగర అదనపు పోలీసు కమిషనర్‌ పి.విశ్వప్రసాద్‌ వెల్లడించారు.

ఈరోజు సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పంజాగుట్ట జంక్షన్, గ్రీన్‌ ల్యాండ్‌ జంక్షన్, బేగంపేట్‌ ఫ్లైఓవర్, శ్యాంలాల్‌ బిల్డింగ్, పీపీఎన్‌టీ ఫ్లైఓవర్, హెచ్‌పీఎస్‌ ఔట్‌గేట్, ఎయిర్‌పోర్టు వై.జంక్షన్, మోనప్ప జంక్షన్, యశోద హాస్పిటల్, కత్రియ హోటల్, మెట్రో రెసిడెన్సీ, పీవీ విగ్రహం, రాజ్‌ భవన్‌ రోడ్, ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్, నెక్లెస్‌ రోడ్డు, తెలుగు తల్లి జంక్షన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్‌ మార్గ్, కట్టమైసమ్మ, ఇక్బాల్‌ మినార్, ట్యాంక్‌ బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం జంక్షన్, అశోక్‌నగర్‌ జంక్షన్‌, ఎన్టీఆర్‌ స్టేడియం ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు.

ఈనెల 22న (శుక్రవారం) ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాదాపూర్, రాయదుర్గం, కొత్తగూడ, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ దారులను చూసుకోవాలని సైబరాబాద్‌ జాయింట్‌ సీపీ జోయల్‌ డేవిస్‌ వెల్లడించారు. నగరంలో ట్రాఫిక్‌ సమాచారం కోసం ట్రాఫిక్‌ హెల్ప్‌లైన్‌ టోల్ ఫ్రీ నెంబర్ 85004 11111 అందుబాటులో ఉంటుందని చెప్పారు. వాహనదారులు ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్తగా ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలన్నారు.

ఇకపోతే..రాష్ట్రపతి ముర్ము ఈరోజు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనున్నారు. శుక్రవారం మాదాపూర్ శిల్పకళా వేదికగా నిర్వహించే లోక్ మంతన్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి 120 దేశాల నుంచి 1,500 మంది ప్రతినిధులు హాజరవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related Posts
రెండు రోజుల్లో వరద బాధితుల అకౌంట్లలో డబ్బులు వేస్తాం: చంద్రబాబు
CM Chandrababu held meeting with TDP Representatives

అమరావతి: ఇటీవల విజయవాడ నగరంలో బుడమేరు పొంగడంతో భారీ వరద ముంచింది. ఈ వరద కారణంగా చాలా ఇళ్లలోకి నీరు చేరి, ఆవాసాల్లోని అనేక వస్తువులు నష్టపోయాయి. Read more

Vandana Katariya : రిటైర్మెంట్ ప్రకటించిన హాకీ ప్లేయర్
Vandana Katariya

భారత మహిళల హాకీ జట్టు స్టార్ ప్లేయర్ వందన కటారియా అంతర్జాతీయ హాకీ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ వార్తను ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించగా, Read more

తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు ..ఇదే తొలిసారి!
Earthquakes in Telugu state

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం భూ ప్రకంపణలు ఏర్పడ్డాయి. దీనితో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. హైదరాబాద్ నగరంలోనూ భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 5.3 గా Read more

ప్రముఖ అకౌంటింగ్ కంపెనీలో ఉపాధి అవకాశాలు
Ernst & Young

అస్యూరెన్స్, టాక్స్, ట్రాన్సక్షన్స్ అండ్ అడ్వైసరి సర్వీసెస్లో గ్లోబల్ లీడర్ అయిన అకౌంటింగ్ కంపెనీ ఎర్నెస్ట్&యంగ్(Ernst & Young) తాజాగా భారతీయ జాబ్ మార్కెట్‌పై గొప్ప ప్రభావాన్ని Read more