భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) తన పుట్టినరోజు వేడుకల్లో భావోద్వేగానికి గురయ్యారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజువల్ డిసెబిలిటీస్ (NIEPVD)ను సందర్శించిన రాష్ట్రపతికి అక్కడి అంధ విద్యార్థులు గానం ద్వారా బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు.
పాటలతో మనసు తాకిన అంధ విద్యార్థులు
విద్యార్థుల మృదువైన గాత్రం, హృదయాన్ని తాకే పాటలు రాష్ట్రపతి ముర్మును ఆవేశానికి గురిచేశాయి. “వారిపాటలు వారి మనస్సుల లోతుల్లో నుంచి వచ్చినవే. అందుకే నా భావోద్వేగాన్ని ఆపలేక కన్నీళ్లు వచ్చాయి,” అని ఆమె అనంతరం తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు రాష్ట్రపతి దయాగుణానికి మెచ్చుకుంటున్నారు.
వికలాంగుల సాధికారతపై రాష్ట్రపతి ప్రత్యేక దృష్టి
ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ, శారీరక వైకల్యంతో ఉన్నవారిలో ప్రత్యేకమైన సామర్థ్యం ఉంటుందని, వారికి సరైన ప్రోత్సాహం, అవకాశాలు కల్పిస్తే వారు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా వికలాంగుల సాధికారత కోసం చేపడుతున్న చర్యలను ఆమె వివరించారు. NIEPVD వంటి సంస్థలు చేస్తున్న కృషిని ప్రశంసించారు. రాష్ట్రపతిగా కాకుండా ఓ తల్లి, మానవతావాది కోణంలో ఆమె చూపిన స్పందన, దేశ ప్రజల గుండెల్లో గాఢంగా మిగిలిపోయింది.
Read Also : Polavaram Project : పోలవరం వల్ల భద్రాద్రి ఆలయం మునిగిపోయే ప్రమాదం – ఎమ్మెల్సీ కవిత