President Droupadi Murmu addressing the nation on Republic Day

జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతినుద్దేశించి మాట్లాడారు. ఈ గణతంత్ర దినోత్సవం మనకు మరింత ప్రత్యేకమైంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతోంది. దేశం మొత్తం గర్వించదగిన సందర్భం ఇది. మన లక్ష్యాల దిశగా నిజమైన ప్రయాణం సాగుతోంది. అంతర్జాతీయంగా నాయకత్వం వహించేలా భారత్‌ ఎదిగింది. భరతమాత విముక్తి కోసం త్యాగాలు చేసిన వారిని స్మరించుకోవాలని రాష్ట్రపతి తెలిపారు.

Advertisements
image

న్యాయం, స్వేచ్చ, సమానత్వం. సోదరభావం ఎల్లప్పుడు మన నాగరిక వారసత్వంలో భాగాంగా ఉన్నాయని రాష్ట్రపతి తెలిపారు. దేశంలో జమిలి ఎన్నికలు పాలనలో స్థిరత్వాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. మహా కుంభమేళా మన నాగరికత వారసత్వ గొప్పతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా చ‌ట్టాల‌ను మార్చుకున్నామ‌ని, ఈ ఏడాది కొత్త చ‌ట్టాల‌ను రూపొందించి అమ‌ల్లోకి తెచ్చామ‌ని రాష్ట్ర‌ప‌తి తెలిపారు. ఇక భార‌త్ అంత‌ర్జాతీయంగా నాయ‌క‌త్వం వ‌హించేలా ఎద‌గ‌డం ఎంతో గ‌ర్వ‌కార‌ణమ‌ని పేర్కొన్నారు. ఈ ఏడాది బిర్సా ముండా 150వ జ‌యంతిని జ‌రుపుకున్నామ‌ని, వెలుగులోకి రాని మ‌రికొంద‌రు ధైర్య‌వంతుల‌ను స్మ‌రించుకోవాల‌ని పిలుపునిచ్చారు.

Related Posts
రేవంత్ రెడ్డితో రేపు సినీ పరిశ్రమ భేటీ: దిల్ రాజు
రేవంత్ రెడ్డితో రేపు సినీ పరిశ్రమ భేటీ: దిల్ రాజు

సిని పరిశ్రమ రేపు సీఎం రేవంత్ రెడ్డిని కలవనుంది: దిల్ రాజు తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు, రేపు Read more

ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి అమలుతో ఈ మార్పులు?
Uttarakhand UCC

దేశంలో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలు చేసిన తొలిరాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ఆ రాష్ట్రంలో సోమవారం నుంచి యూసీసీ అమల్లోకి వచ్చింది. ఉత్తరాఖండ్‌లోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న Read more

తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకు కేటీఆర్
Disqualification case of Telangana MLAs.. KTR to Supreme

హైదరాబాద్‌: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీం కోర్టును బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆశ్రయించారు. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం Read more

MLCఎలక్షన్స్: ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే?
Telangana MLC nomo

తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాల కోసం నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది.MLCఎలక్షన్స్: ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే . ఈ మూడు స్థానాలకు మొత్తం 118 మంది అభ్యర్థులు Read more

×