న్యూఢిల్లీ: ఈరోజు దేశ జాతిపిత, స్వాతంత్య్ర సమరయోధుడు మహాత్మా గాంధీ వర్ధంతి. ఈ సందర్భంగా గాంధీకి పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ నివాళులర్పించారు. గురువారం ఉదయం ఢిల్లీలోని రాజ్‌ఘాట్ ను సందర్శించి అక్కడ బాపూజీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. పలువు కేంద్ర మంత్రులు సైతం గాంధీజీకి నివాళులర్పించారు.
Advertisements