Prayed to God for a solution to Ayodhya dispute says CJI Chandrachud

అయోధ్య వివాదం పరిష్కారం కోసం దేవుడిని ప్రార్థించాను: సీజేఐ డీవై చంద్రచూడ్‌

న్యూఢిల్లీ: అయోధ్య తీర్పుపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి పరిష్కారం కోరుతూ దేవుడిని ప్రార్థించానని ఆయన చెప్పారు. నమ్మకం ఉంటే దేవుడే దారి చూపుతాడని ఆయన వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని ఖేడ్ తాలూకాలో ఉన్న తన స్వగ్రామం కన్హెర్సర్‌లో జరిగిన సత్కార కార్యక్రమంలో ఈ మేరకు ఆయన ప్రసంగించారు.

‘‘ తరచుగా మేము తీర్పు చెప్పాల్సిన కేసులు ఉంటాయి. కానీ మేము ఒక పరిష్కారానికి రాలేము. రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం సమయంలో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఈ వివాదం మూడు నెలలపాటు నా ముందు ఉంది. నేను దైవం ముందు కూర్చున్నాను. నేను ఒక పరిష్కారాన్ని చూపించాల్సి ఉందని దేవుడితో చెప్పాను’’ అని చంద్రచూడ్ వివరించారు. తాను నిత్యం దేవుడిని పూజిస్తానని చంద్రచూడ్ చెప్పారు. ‘‘ మీకు నమ్మకం ఉంటే దేవుడే ఎల్లప్పుడూ ఒక మార్గాన్ని చూపిస్తాడు’’ అని ఈ సందర్భంగా అన్నారు.

కాగా నవంబర్ 9, 2019న నాటి భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీం ధర్మాసనం అయోధ్య వివాదంపై తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసింది. ఇక అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిన ఈ ధర్మాసనంలో ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కూడా ఉన్నారు. ఇక ఈ ఏడాది జులైలో అయోధ్య రామాలయాన్ని జస్టిస్ డీవై చంద్రచూడ్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

Related Posts
అసెంబ్లీకి వస్తా.. కాంగ్రెస్ అంతు చూస్తా- కేసీఆర్
పార్టీ కీలక నేతలతో కేసీఆర్ భేటీ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, త్వరలోనే రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. త్వరలో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో Read more

హోలీ శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు – సీఎం రేవంత్ రెడ్డి

దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్నా – పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రంగుల పండుగను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. మిత్రులు, కుటుంబ సభ్యులు, పొరుగు Read more

ఎలాన్ మస్క్‌కు షాకిచ్చిన డోజ్ ఉద్యోగులు
ట్రంప్ సమక్షంలోనే నేతల గొడవలు..అలాంటివి లేవని వివరణ

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో.. ఎలాన్ మస్క్‌కు అక్కడి ఉద్యోగులు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ముఖ్యంగా ఫెడరల్ ఉద్యోగులను తొలిగించడాన్ని ఏమాత్రం Read more

పిఠాపురానికి 100 పడకల ఆసుపత్రి
pitapuram hsp

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గం పిఠాపురానికి మెరుగైన వైద్య సేవలను అందించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఉన్న 30 పడకల కమ్యూనిటీ Read more