Prashant Kishor hunger strike broken.. Forced transfer to AIIMS

ఎయిమ్స్‌కు ప్రశాంత్ కిషోర్ తరలింపు

పాట్నా: బిహార్ పబ్లిక్ సర్వీసెస్ పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్‌తో ప్రశాంత్ కిషోర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ రాజకీయ నేతగా మారి విద్యార్థులకు మద్దతుగా పట్నాలోని గాంధీ మైదానంలో గాంధీ విగ్రహం వద్ద జనవరి 2న దీక్షను ప్రారంభించారు. అయితే, సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆయనను అదుపులోకి తీసుకొని ఎయిమ్స్ దవాఖానకు తరలించారు. పోలీసులకు వెళ్లేందుకు ఆయన నిరాకరించడంతో బలవంతంగా అక్కడి నుంచి ఆయనను తరలించారు. దీక్షా స్థలి వద్ద వేదికను ఖాళీ చేయించడంతోపాటు, పార్టీ శ్రేణులు మరియు పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో గాంధీ మైదానం వద్ద గందరగోళం ఏర్పడింది.

కాగా, డిసెంబర్ 13న బీహార్‌లో నిర్వహించిన బీపీఎస్సీ కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. దీన్ని రద్దు చేయాలన్న డిమాండ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఆందోళనలు చేపట్టారు. నిరసనల సమయంలో పోలీసుల లాఠీచార్జ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఆందోళనకారులకు మద్దతుగా ప్రశాంత్ కిషోర్ దీక్షకు దిగారు. ఇక, ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఖరీదైన లగ్జరీ వ్యానిటీ వ్యాన్ నిరసన ప్రాంతం సమీపంలో పార్క్ చేయడం వివాదాస్పదమైంది. కోట్ల విలువైన ఈ వాహనంలో కిచెన్, బెడ్ రూమ్, ఏసీ వంటి సౌకర్యాలు ఉండడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీని వల్ల ప్రశాంత్ కిషోర్ లక్ష్యాలపై అనుమానాలు, విమర్శలు వచ్చాయి.

Related Posts
వరంగల్‌లో బ్యాంకు ఉద్యోగి దారుణ హత్య
A bank employee was brutally murdered in Warangal

వరంగల్ : వరంగల్ నగరంలో పట్టపగలే హత్య చేసి మృతదేహాన్ని కారులో పెట్టిన ఘటన కలకలం సృష్టించింది. కాళ్లకు తాళ్లు కట్టి హత్య చేసి.. కారులో పెట్టి Read more

ఇది సామాన్య ప్రజల తీర్పు!
aravind kejriwal

అరవింద్ కేజ్రీవాల్ దేశ రాజకీయాల్లో ఒక సంచలనం. అవినీతికి వ్యతిరేకంగా జన్‌లోక్‌పాల్ వ్వవస్థను తీసుకురావాలని గాంధేయవాది అన్నా హజారే చేసిన దీక్షతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించారు కేజ్రీవాల్. Read more

క్రిస్మస్ వేడుకలలో ప్రపంచ దేశాల ఐక్యత..
christmas

క్రిస్మస్ వేడుకలు ప్రారంభం కావడంతో, ప్రపంచవ్యాప్తంగా పండుగ సీజన్ మరింత ఉత్సాహంగా మారింది. యేసుక్రీస్తు జన్మదినాన్ని ఉత్సాహంగా జరుపుకునే ఈ రోజు, ఆనందం మరియు సద్భావనతో ప్రపంచవ్యాప్తంగా Read more

పక్కా ప్రణాళికతో దాదాపు రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం రేవంత్
revanth

తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించే కేంద్రంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు. తాజాగా దాదాపు రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షించగలిగిందని ఆయన తెలిపారు. ఈ Read more