2024లో సంచలనం సృష్టించిన అత్యాచార కేసులో దోషిగా తేలిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (prajwal revanna) తాను తక్కువ శిక్షకు అర్హుడినని కోర్టును వేడుకున్నాడు. తీర్పు వెలువడిన వెంటనే ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. 2024 ఏప్రిల్ 28న కేఆర్ నగర్(K.R.Nagar)కు చెందిన ఓ మహిళ హొళెనరసీపుర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ప్రజ్వల్ రేవణ్ణపై అత్యాచారం కేసు నమోదైంది. ఆమె ఫిర్యాదులో గన్నిగడ ఫాంహౌస్‌లో ఆమెపై లైంగిక దాడి జరిగిందని పేర్కొన్నారు.
వీడియో ఆధారాలు – 2000 పైగా క్లిప్స్
పోలీసుల దర్యాప్తులో ప్రజ్వల్ మొబైల్ ఫోన్‌లో 2000కు పైగా లైంగిక వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. వీటిని ఆయన స్వయంగా చిత్రీకరించినట్లు సమాచారం. వీడియో ఆధారాలు కేసులో కీలకంగా మారాయి.

జైల్లో 14 నెలలు – విచారణ ఖైదీగా
కేసు దర్యాప్తు సమయంలో ప్రజ్వల్ 14 నెలలుగా జైలులో ఉన్నారు. విచారణ సమయంలో అతని విదేశాలకు పారిపోవడం, తరువాత కుటుంబ సభ్యుల ఒత్తిడితో లొంగిపోవడం కూడా ఈ కేసులో ముఖ్యాంశాలుగా నిలిచాయి.
మరికొన్ని కేసులు వెలుగులోకి
ఈ కేసు బయటపడిన తరువాత ప్రజ్వల్‌పై మరికొన్ని లైంగిక ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాధితుల సంఖ్య పెరుగుతోంది. ప్రజాప్రతినిధుల న్యాయస్థానం ప్రజ్వల్‌ను ఇప్పటికే దోషిగా తేల్చిన నేపథ్యంలో త్వరలో శిక్ష ఖరారు కానుంది. గన్నిగడ ఫాంహౌస్‌లో తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మరికొన్ని అత్యాచార కేసులు ప్రజ్వల్‌పై నమోదయ్యాయి. ఈ కేసు విచారణ జరుగుతున్న క్రమంలో ఆయన 14 నెలలుగా జైలులో విచారణ ఖైదీగా ఉన్నారు .
Read hindi news: hindi.vaartha.com
Read also