బీజేపీ సీనియర్ నేత,బార్ గఢ్ ఎంపీ, లోక్‌సభలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ పునర్జన్మ రూపంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మించారని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఛత్రపతి శివాజీయే మోదీ రూపంలో మళ్లీ జన్మించారని వ్యాఖ్యానించడంపై సభలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రదీప్ పురోహిత్ కామెంట్స్
బార్‌గఢ్ ఎంపీ ప్రదీప్ పురోహిత్ మంగళవారం లోక్‌సభలో ప్రసంగిస్తూ, గతంలో ఓ సాధువుతో తనకు జరిగిన సంభాషణను వివరించారు.”ఓ సాధువు నాకు చెప్పినట్టు, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ జన్మలో నరేంద్ర మోదీ రూపంలో పునర్జన్మ పొందారని చెప్పారు. శివాజీ మహారాజ్ నాటి మరాఠా సామ్రాజ్య ఖ్యాతిని దశదిశలా చాటినట్లే, మోదీ భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ వన్‌గా నిలిపేందుకు కృషి చేస్తున్నారు.”ఈ వ్యాఖ్యలతో ఆయన నరేంద్ర మోదీని శివాజీ మహారాజ్‌తో పోల్చారు, దేశ అభివృద్ధి కోసం మోదీ శివాజీ మాదిరిగా పోరాడుతున్నారని వాదించారు.
నెటిజన్ల ఆగ్రహం
చాలామంది “శివాజీ మహారాజ్ స్వతంత్రంగా పాలించిన రాజు, రాజకీయ నాయకులతో పోల్చడం సరైంది కాదు” అని కామెంట్లు చేశారు.
కాంగ్రెస్ నేతలు
కాగా, ఎంపీ ప్రదీప్ పురోహిత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు,తీవ్రంగా మండిపడుతున్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ తో ప్రధాని మోదీని పోల్చడం కరెక్ట్ కాదని, ఇది శివాజీ మహారాజ్‌ను అవమనించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లోక్‌సభలో బీజేపీ ఎంపీ ప్రదీప్ పురోహిత్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్‌తో మోదీని పోల్చడాన్ని కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్) పార్టీలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఈ వివాదం మళ్లీ రాజకీయంగా దుమారం రేపే అవకాశం ఉంది.నెటిజన్లు కూడా ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం ఈ వివాదాస్పద వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలోవైరల్ అవుతోంది.