prabhas bday

HAPPY BIRTHDAY రెబల్ స్టార్ ‘ప్రభాస్’

బాహుబలి చిత్రంతో ప్రపంచ దేశాల్లో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన స్టార్ ‘ప్రభాస్’. నాటి నుంచి పాన్ ఇండియా జైత్రయాత్ర మొదలుపెట్టిన ఆయన పుట్టిన రోజు నేడు. ప్రభాస్ పుట్టినరోజు అంటే ఆయన అభిమానులకే చిత్రసీమ ప్రముఖులకు కూడా పెద్ద పండగే. “బాహుబలి”తో ఆయన కీర్తి పాన్ ఇండియా స్థాయి కి వెళ్ళింది.. ఆ ప్రయాణం అక్కడితో ఆగలేదు. తర్వాత వచ్చిన “సాహో”తో ఆయన యాక్షన్ జోనర్‌లో తన సత్తా చాటి మరోసారి పాన్-ఇండియా స్టార్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత కల్కి తో తారాస్థాయికి వెళ్ళింది. రెబెల్ స్టార్ నుండి గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన తీరు అనేకమంది అభిమానులు స్ఫూర్తి నింపింది.

ప్రభాస్, పూర్తి పేరు ఉప్పలపాటి వేంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రఖ్యాత నటుడు ఈయన. 2002లో వచ్చిన “ఈశ్వర్” అనే సినిమాతో తన సినీ జీవితాన్ని ప్రారంభించిన ప్రభాస్, “వర్షం” (2004) సినిమా ద్వారా బ్రేక్ అందుకున్నారు. అప్పటినుండి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.

2015లో విడుదలైన ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “బాహుబలి: ది బిగినింగ్” సినిమా ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టింది. “బాహుబలి” సిరీస్ రెండో భాగం “బాహుబలి 2: ది కన్‌క్లూజన్” (2017) భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ రెండు చిత్రాలు ప్రభాస్‌ను పాన్-ఇండియా స్టార్‌గా మార్చాయి.

ప్రభాస్‌ కెరీర్‌లోని కొన్ని ముఖ్యమైన సినిమాలు:

వర్షం (2004): ఈ ప్రేమకథా చిత్రం ప్రభాస్‌కు తొలి ఘన విజయం అందించింది.
ఛత్రపతి (2005): రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ నటన పట్ల ప్రేక్షకులు ప్రశంసలు పొందారు.
బాహుబలి సిరీస్ (2015, 2017): ఈ చిత్రాలు ప్రభాస్‌ను అంతర్జాతీయ స్థాయికి చేర్చాయి.
సాహో (2019): ప్రభాస్ పాన్-ఇండియా స్థాయిలో మరో భారీ విజయం అందుకున్న సినిమా.
రాధే శ్యామ్ (2022): ప్రేమకథా చిత్రం, ప్రభాస్‌ నటనకు మంచి స్పందన వచ్చింది.
ప్రభాస్ తన వృత్తిలోనే కాకుండా తన వినయంతో, నిష్కపటతతో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం రాజాసాబ్ , స్పిరిట్ తో పాటు మరో రెండు పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు. ఇలాంటి పాన్ స్టార్ కు మా ‘వార్త’ తరుపున మరోసారి పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేస్తున్నాం.

Related Posts
జగన్ కేసులపై విచారణ వాయిదా
అసెంబ్లీకి హాజరు కాకూడదని జగన్ నిర్ణయం

మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసుల్లో సీబీఐ, ఈడీలు తన పరిశోధన వివరాలను నిన్న కోర్టులో ఫైల్ Read more

ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయం : సీఎం చంద్రబాబు
Srivari temple in every state capital: CM Chandrababu

తిరుపతిలో అంతర్జాతీయ ఆలయాల సదస్సు, ప్రదర్శన ప్రారంభంలో సీఎం చంద్రబాబు తిరుపతి: కలియుగ దైవం వేంకటేశ్వర స్వామివారి కీర్తిని విశ్వవ్యాప్తం చేయాలని భావిస్తున్నాం. దేశంలోని ప్రతి రాష్ట్ర Read more

కేంద్ర ప్రభుత్వం కొత్త పాన్ కార్డ్
pancard

PAN 2.0 🪪 వెర్షన్‌ని ప్రకటించింది. అయితే దీని కోసం మీరు ఏమీ చేయనవసరం లేదు, కొత్త అప్‌డేట్ చేసిన పాన్ కార్డ్‌ని ప్రభుత్వం నేరుగా మీ Read more

ఓటీటీలో సీఐడీ స్ట్రీమింగ్
ఓటీటీలో సీఐడీ స్ట్రీమింగ్

భారతీయ టెలివిజన్‌లో లాంగెస్ట్-రన్నింగ్ క్రైమ్ థ్రిల్లర్ షోలలో సీఐడీ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 1998లో ప్రారంభమైన ఈ సిరీస్ 2018 వరకు 20 ఏళ్లపాటు కొనసాగింది. Read more