మంచు విష్ణు (Vishnu) ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’ (Kannappa) ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. భక్తిరసంలో రూపొందిన ఈ చిత్రం, శైవ భక్తుడైన కన్నప్ప జీవితకథ ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రచారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మంచు విష్ణు తన ఇంటర్వ్యూల్లో సినిమాలోని విశేషాలు, ప్రమోషన్ ప్లాన్స్ పై పలు విషయాలు వెల్లడించారు.
ముంబైలో భారీ ఈవెంట్
విష్ణు పేర్కొన్నట్లు.. ముంబైలో జరగబోయే ట్రైలర్ విడుదల కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్తో పాటు ప్రభాస్ కూడా హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. అయితే కొన్ని పరిస్థితుల వల్ల ముంబై ఈవెంట్‌కు ప్రభాస్ రాలేని పరిస్థితి వస్తే, హైదరాబాద్‌లో జరగబోయే ప్రీరిలీజ్ ఈవెంట్ కు తప్పకుండా హాజరవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రభాస్ హాజరు
ప్రభాస్ హాజరైతే ఈవెంట్‌కు మరింత ఆకర్షణ చేకూరనుంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా విజయం కోసం విష్ణు ఎంతో నమ్మకంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలకు మంచి స్పందన లభించగా, స్టార్ హీరోల ప్రమోషన్ తో మూవీ హైప్ మరింత పెరిగే అవకాశం ఉంది.
Read Also : Kakani : కాకాణి కస్టడీ పిటిషన్ పై తీర్పు రిజర్వ్