हिन्दी | Epaper
గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్

Hyderabad: ట్యాంక్ బండ్ పై ఘనంగా కుమ్మర్ల తొలిబోనం జాతర

Sharanya
Hyderabad: ట్యాంక్ బండ్ పై ఘనంగా కుమ్మర్ల తొలిబోనం జాతర

— హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎంపిలు ఎం.అనిల్ కుమార్యాదవ్, ఆర్. కృష్ణయ్య

హైదరాబాద్: తెలంగాణ (Telangana) కుమ్మర్ల తొలి బోనం జాతర వేడుకలు ట్యాంక్ బండ్ (Tank bund) పై ఘనంగా నిర్వహించారు. గురువారం నిర్వహించిన ఈ వేడుకలకు మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాజ్యసభ సభ్యుడు ఎం. అనిల్ కుమార్ యాదవ్, ఆర్. కృష్ణయ్య హాజరై తెలంగాణ కుమ్మర్ల తొలి బోనం సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేశారు.

జూన్ 26 నుండి జులై 24 వరకు ఆషాఢం బోనాలు

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కనకాల కట్టమైసమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మట్టి బోనం ఎత్తుకుని అమ్మవారు తెలంగాణ ప్రజలందరినీ చల్లగా చూడాలని వేడుకోవటం మన సాంప్రదాయమని అన్నారు. మన సాంప్రదాయాలకు అనుగుణంగా ఈరోజు నుండి జులై 24 వరకు ఆషాఢం బోనాలు జరుగుతాయని, ముందుగా గోల్కొండ బోనాలు, జులై 1న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, 13న ఉజ్జయిని మహంకాళి ఆలయంలో, 20న లాల్ దర్వాజా బోనాలు జరుపు కోబోతున్నామని తెలి పారు. అందరూ అమ్మ వారి ఆశీర్వాదం పొందాలని నెత్తిమీద మట్టిబోనం ఎత్తు కుంటారని, ఇది కుల వృత్తుల మీద ఆధార పడుతున్న కుమ్మర్లకు ఆర్థికంగా సాయ పడు తుందని కుమ్మర్ల అన్నారు. అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో భాగంగా హెచ్ ఎండిఏ గ్రౌండ్స్ హై మాక్స్ పక్కన నిర్వహించిన బీసీ కుల వృత్తుల మేళలో కూడా కుమ్మర్ల కుండలు పెట్టటం జరిగిందని తెలిపారు. ఉగాది నాడు కుండచాయ్ కప్పు, మట్టి వాటర్ బాటిల్ వంటి మట్టి వస్తువులను అందరికీ అందచేశామని, దీనివల్ల మట్టి వస్తువులకు ఎంతో ప్రచారం జరిగిందని పేర్కొన్నారు.

కుమ్మర్ల వృత్తి రక్షణకు రాబోయే కాలంలో గుజరాత్ లో ఉన్న సాంకేతికత తెలుసుకోవటానికి ప్రతినిధులను పంపి వారి ద్వారా ఇక్కడ కూడా శిక్షణ ఇప్పిస్తామని స్పష్టం చేశారు. కుమ్మర్లకు మారుతున్న కాలానికి కుమ్మర్ల తొలి బోనం జాతర సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మారుతున్న సాంకేతికత పెరిగే విధంగా యాంత్రీకరణ చేస్తూ శిక్షన ఇవ్వటానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇది కుమ్మర్లు ఆర్ధికంగా ఎదగటానికి ఎంతో ఉపయో గపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రజలు అన్ని గ్రామా ల నుండి చుట్టాలను పిలుచుకుని ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని సూచించారు. ఈ వేడుకలలో ఫిషరీస్ కార్పోరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్, కవాడిగూడ కార్పోరేటర్ రచనశ్రీ, బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.

Read also: Dwacra : డ్వాక్రా మహిళలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870