ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఆర్ఎంబీ కి లేఖ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తోందని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవలే కృష్ణా నది యాజమాన్య బోర్డు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం బోర్డు సమావేశం కావాల్సి ఉంది. కానీ అనూహ్యంగా సమావేశాన్ని వాయిదా వేయాలని కోరుతూ.. ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఆర్ఎంబీ కి లేఖ రాశారు.

సోమవారం మధ్యాహ్నానికి వాయిదా
అత్యవసర సమావేశం ఉన్నందున భేటీని వాయిదా వేయాలని ఆ లేఖలో ప్రస్తావించారు. మధ్యాహ్నం 3.30 గంటలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు నీటి పారుదల శాఖ అధికారులు కేఆర్ఎంబీ కార్యాలయానికి వెళ్లి అక్కడ తమ వాదనలు వినిపించనున్నారు. ముఖ్యంగా తాగు, సాగు నీటి అవసరాలను బోర్డుకు వివరించనున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశాన్ని సోమవారం మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.
కృష్ణా జలాల పంపిణీ, వాటి తరలింపు విషయం
కాగా, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా నది జలాలపై జరిగే వివాదం మరింత పెరిగింది. ముఖ్యంగా జల వనరుల పంపిణీ విషయంలో అవగాహనల పరిమితులు, రాజకీయం, భద్రతా దృష్టికోణాలు ఉండడం వలన. గతంలో ఈ రెండు రాష్ట్రాలు, ముఖ్యంగా కృష్ణా జలాల పంపిణీ, వాటి తరలింపు విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నాయి. కృష్ణా నది, ఇది రెండు రాష్ట్రాలకు జీవనాధారం, వ్యవసాయం, తాగు నీటి అవసరాల కోసం ప్రాధాన్యత ఉన్నది. ఏపీ నుండి తెలంగాణకు సరిపడా నీటి flow అందించడం, కృష్ణా నది ఒప్పందాలు మరియు వర్తమాన పరిస్థితులు అనుసరించకపోతే, రెండు రాష్ట్రాల మధ్య శాంతియుత పరిష్కారం సాధించడం కష్టం అవుతుంది.