శాంతిభద్రతల సమస్య, కోరం లేకపోవడం
అమరావతి: తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. శాంతిభద్రతల సమస్య, కోరం లేకపోవడం కారణంగా వాయిదా వేసినట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. రేపు(మంగళవారం) ఉదయం ఎన్నిక నిర్వహిస్తామని తెలిపారు. అలాగే పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక కూడా కోరం లేక మళ్లీ వాయిదా పడింది. మరోవైపు పిడుగురాళ్ల మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్‌గా ఉన్నం భారతి ఎన్నికయ్యారు.

ఏకగ్రీవంగా భారతి ఎన్నిక
ఈ తరుణంలో ఇవాళ పిడుగురాళ్ల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తయింది. వైస్ ఛైర్మన్‌గా ఉన్నం భారతిని ఏకగ్రీవంగా కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. ఆమె పట్టణంలోని 30 వార్డు కౌన్సిలర్‌గా ఉన్నారు. ఈ రోజు జరిగిన కౌన్సిల్ సమావేశంలో మొత్తం 17 మంది కౌన్సిలర్లు హాజరుకాగా మొత్తం ఉన్నం భారతికి మద్దతు తెలిపారు. దీంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్డీవో ప్రకటించారు.
పల్నాడులో ప్రజాస్వామ్యం ఖూనీ
పిడుగురాళ్లలో పట్ట పగలే ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. అరాచకానికి ఐకాన్‌గా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మారారు. పిడుగురాళ్లలో మొత్తం 33 వార్డులు ఉండగా.. గతంలో 33 వార్డులను వైసీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా గెలవని తెలుగుదేశం. అయితే, ఎన్నికల సమయంలో వైసీపీ కౌన్సిలర్‌ను తన వైపునకు తిప్పుకున్న యరపతినేని. బలం, అర్హత లేకపోయినా వైస్ చైర్మన్ పదవి కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన శ్రీనివాసరావు.