Postponement of counseling for DSC teachers

డీఎస్సీ ఉపాధ్యాయుల పోస్టింగ్‌ కౌన్సెలింగ్‌ వాయిదా

హైదరాబాద్‌: డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టింగ్‌ కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన కౌన్సెలింగ్‌ ప్రక్రియను సాంకేతిక కారణాలతో వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త కౌన్సెలింగ్‌ తేదీలను త్వరలో ప్రకటిస్తామని విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. అయితే డీఎస్సీలో సెలెక్ట్‌ అయిన ఉపాధ్యాయుల కౌన్సెలింగ్‌కు సంబంధించి అన్ని జిల్లాల డాటా రాకపోవడంతోనే పోస్ట్‌పోన్‌ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

డీఎస్సీ 2024 ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకున్న కొత్త టీచర్లకు మంగళవారం పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. నూతన టీచర్లు ఆయా డీఈఓలు సూచించిన కార్యాలయాల్లో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. అయితే సాంకేతిక కారణాలతో కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. కాగా, కౌన్సెలింగ్‌ బుధవారం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. మెరిట్‌ సాధించిన అభ్యర్థులు తాము కోరుకున్న చోట కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

Related Posts
రాజస్థాన్ విద్యుత్ శాఖతో సింగరేణి ఒప్పందం
Singareni agreement with Rajasthan Power Department

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ ముందడుగు కారణంగా సింగరేణి వ్యాపార విస్తరణలో మరో కీలకమైన ఘట్టం ప్రారంభమవుతోంది. నేడు రాజస్థాన్ విద్యుత్ శాఖతో 3100 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులపై Read more

భారతీయ వలసదారుల పట్ల భారత్ ఏమి చేయబోతుంది?
indian immigrants in us.

అమెరికా లో ఉంటున్న అక్రమ వలసదారులను ట్రంప్ ప్రభుత్వం వెనక్కి పంపుతోంది. ఇప్పటికే 104 మంది భారతీయులను అమెరికా మిలటరీ విమానం C-17 మోసుకొచ్చింది. మరింతమందిని వెనక్కి Read more

‘దబిది దిబిది’ వివాదంపై ఊర్వశి
'దబిది దిబిది' వివాదంపై ఊర్వశి

ప్రస్తుతం తన "దబిది దిబిది" పాటతో వార్తల్లో నిలిచిన నటి ఊర్వశి రౌతేలా, నందమూరి బాలకృష్ణతో కలిసి డ్యాన్స్ చేయడం తనకు కేవలం ఒక ప్రదర్శన మాత్రమే Read more

పద్మ అవార్డులు 2025: పూర్తి జాబితా
పద్మ అవార్డులు 2025: పూర్తి జాబితా

ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డుల గ్రహీతలను కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. పద్మ అవార్డులు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి, ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా Read more