Posani Krishna Murali : విచారణ అనంతరం తిరిగి జైలులో అప్పగింత సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా వారి కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో ఆయనను ఇటీవల రిమాండ్‌కు తరలించారు.తాజాగా, పోసానిని విచారణ కోసం నిన్న సీఐడీ కార్యాలయానికి తరలించిన సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గుంటూరు సీఐడీ పోలీసులు ఆయనతో సెల్ఫీలు, ఫొటోలు తీసుకోవడం వివాదాస్పదంగా మారింది.

విచారణకు తీయగా.. సెల్ఫీలు తీసుకున్న అధికారులు!
ఒక రోజు కస్టడీ ముగిసిన తర్వాత పోసానిని తిరిగి కోర్టులో హాజరుపరిచారు.
అనంతరం జిల్లా జైలుకు తరలించేందుకు ఆయనను ప్రధాన ద్వారం వద్ద తీసుకొచ్చారు.
అదే సమయంలో కొందరు సీఐడీ అధికారులు పోసాని వెంట నిలబడి ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిమాండ్ ఖైదీతో ఇలా ఫొటోలు, వీడియోలు తీయడం కేవలం అధికార దుర్వినియోగమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పోలీసులపై తీవ్ర విమర్శలు
జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తితో పోలీసులు ఇలా ప్రవర్తించడం మౌలిక నిబంధనలకు విరుద్ధమని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.పోలీసులు విధులను పక్కన పెట్టి సెల్ఫీలు దిగడాన్ని తప్పుబడుతున్నారు.ఇది సరిగా లేదని, విచారణ పూర్తయ్యేంతవరకు పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్
సాధారణంగా రిమాండ్ ఖైదీల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసులు, ఇలాంటి చర్యలు తీసుకోవడం అనైతికమని న్యాయ నిపుణులు అంటున్నారు. ఇది అధికార పరమాధికార దుర్వినియోగానికి నిదర్శనమని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.పోసాని కేసు ఇప్పటికి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే, ఈ తాజా వివాదంతో మరోసారి ఈ కేసు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడిక, దీనిపై సీఐడీ అధికారులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి!