బాలీవుడ్ లో తన వివాదాస్పద వ్యాఖ్యలు, బోల్డ్ ఫొటోషూట్‌లతో నిత్యం వార్తల్లో నిలిచే నటి పూనమ్ పాండేకు తాజాగా ఓ చేదు అనుభవం ఎదురైంది. ఓ ఫొటో సెషన్‌లో భాగంగా విలేకరులతో మాట్లాడుతుండగా, వెనుక నుంచి వచ్చిన ఓ అభిమాని ఆమెతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆ అభిమాని అకస్మాత్తుగా పూనమ్ పై దురుసుగా ప్రవర్తించేందుకు ప్రయత్నించడంతో, నటి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది.వెంటనే తేరుకున్న పూనమ్ అతడిని బలంగా నెట్టివేసింది. అలాగే, ఫొటో జర్నలిస్టు ఒకరు వెంటనే అప్రమత్తమై అతడి నుంచి ఆమెను రక్షించారు.
నెటిజన్ల స్పందన
ఇదంతా స్క్రిప్టెడ్ అనిపిస్తోంది, ముందుగా ప్లాన్ చేసిన పబ్లిసిటీ స్టంట్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు.వీడియోను గమనిస్తే మొదటి నుంచీ ఆమె తీరు అనుమానాస్పదంగా ఉందని ఒకరు, ఆమె అంత బాగా నటించలేదని మరొకరు రాసుకొచ్చారు.
ఇది తొలి వివాదం కాదు
పూనమ్ పాండే ఇలాంటి వివాదాలతో వార్తల్లో ఉండటం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఆమె వివిధ సందర్భాల్లో పబ్లిసిటీ కోసం పలు ప్రయత్నాలు చేసిందిగర్భాశయ క్యాన్సర్ అవగాహన పేరిట నకిలీ మరణ వార్త
క్యాన్సర్‌పై అవగాహన పెంచేందుకు తాను చనిపోయినట్లు ప్రచారం చేయించింది.
అనంతరం తాను బతికే ఉన్నానని, క్యాన్సర్‌పై అవగాహన పెంచడమే తన ఉద్దేశమని వివరణ ఇచ్చింది.

పెళ్లి – విడాకుల వివాదం
సినీ నిర్మాత శామ్ బాంబేతో వివాహం చేసుకున్న పూనం, కొద్దిరోజుల్లోనే విడాకులు తీసుకుంది.
సినీ పరిశ్రమలో నటిగా పెద్దగా రాణించలేకపోయినా, సోషల్ మీడియాలో బోల్డ్ ఫొటోలతో, వివాదాస్పద వ్యాఖ్యలతో పూనం ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది.గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన పెంచేందుకు ఒక ప్రకటన చేసింది. తన మరణవార్తను సోషల్ మీడియా ద్వారా ప్రకటించి, తన అభిమానులను షాక్‌కు గురి చేసింది. ఈ వార్త వైరల్ కావడంతో ఎంతోమంది దిగ్భ్రాంతికి లోనయ్యారు. అయితే, కొన్ని గంటల తర్వాత పూనం వీడియో ద్వారా స్పష్టతనిస్తూ, తాను చనిపోయినట్లు ప్రచారం కావడం కేవలం క్యాన్సర్‌పై అవగాహన పెంచడానికేనని చెప్పింది. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన అవసరమని, ఈ ప్రాణాంతక వ్యాధిని పట్టించుకోకపోతే ప్రాణాలు పోయే ప్రమాదముందని చెప్పేందుకు తాను ఈ విధంగా చేసానని వెల్లడించింది. అయితే, ఆమె ఈ చర్యపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు ఇది మంచి ఉద్దేశంతో చేసిన ప్రచారంగా ప్రశంసించగా, మరికొందరు అలాంటి సున్నితమైన విషయాన్ని ఇలా ప్రచారం చేయడం తగదని విమర్శించారు.సమాజంలో మహిళల ఆరోగ్యం, ముఖ్యంగా క్యాన్సర్ గురించి చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో ఈ ప్రచారం చేసినప్పటికీ, మరణ వార్తను అబద్ధంగా ప్రచారం చేయడం కరెక్ట్ కాదు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.