స్టైలిష్ డ్రెస్ లోనా, వెస్ట్రన్ లుక్ లోనా, లేక ట్రెడిషనల్ కట్టులోనా… పూజా హెగ్డే కాజల్ వేశం వేస్తే ఫ్యాన్స్ గుండెల్లో తళతళ మోగుతుంది. తాజాగా ఆమె చీరకట్టులో కనిపించిన ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ లుక్ చూసిన ప్రతి ఒక్కరూ “అమ్మాయ్ఎంత అందంగా ఉందిరా!” అని కామెంట్లు పెడుతున్నారు.పూజా ఈసారి ఎంచుకున్న డ్రెస్ మాత్రం కొంచెం డిఫరెంట్. మింట్-గ్రే కలర్ మిక్స్ లోని ప్యూర్ కాటన్ చీరతో తన అందాన్ని రెట్టింపు చేసింది. చీరతో మ్యాచ్ అయ్యేలా డిజైన్ చేసిన బ్లౌజ్‌కు ఆర్ట్ వర్క్ అద్భుతంగా ఉండగా, జతగా పెట్టిన జ్వెల్లరీనూ ఎంతో టేస్ట్‌ఫుల్‌గా సెలెక్ట్ చేసింది. మెడలో హారాలు, చేతిలో మట్టిగాజులు, వేలికే ఉంగరం, నుదుటిన బొట్టు అన్నీ కలిపితే పూజా లుక్ ఒక మాటలో చెప్పాలంటే – క్లాస్ అండ్ గ్రేస్ రెండూ కలబోసిన కళాఖండం లా మారిపోయింది.ఈ ఫొటోషూట్‌లో పూజా ఎంచుకున్న భంగిమలు కూడా ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఒక్కో ఫొటోలో ఒక్కో మూడ్…

ఒక్కో ఫీల్ ఒకచోట చిరునవ్వుతో తన అందాన్ని ప్రదర్శిస్తే, ఇంకొక్కడే ఏదో ఆలోచనలో ఉన్నట్టు చూపించింది. ఇంకొన్ని ఫొటోల్లో అంతకు మించి – అష్టవిధ నాయికలా, ఒక రొమాంటిక్ హీరోయిన్ గానే కనిపించింది.ఈ లుక్ ఏ సినిమా కోసం అంటే – సూర్యతో కలిసి నటిస్తున్న ‘రెట్రో’ మూవీ కోసమే. ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో పూజా పాత్ర కూడా చాలా స్టైలిష్ గా ఉండనుందని టాక్.ఇదిలా ఉంటే, ఇటీవల తెలుగు ఇండస్ట్రీలో పూజా ప్రెజెన్స్ కాస్త తగ్గినా, తమిళ సినిమాల్లో మాత్రం మంచి స్పీడ్ పెంచింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. కాంచన-4, జననాయగన్ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అంతేకాదు, రజనీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో ఒక ప్రత్యేక గీతంలో పూజా కనిపించనుందని సమాచారం. ఈ స్పెషల్ సాంగ్ అభిమానులకు పెద్ద ఫీస్ట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.సోషల్ మీడియా వేదికగా పూజా అప్పుడప్పుడూ తన స్టన్నింగ్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తూ ఉంటుంది. తాజా చీరకట్టు ఫొటోస్ చూస్తుంటే, ట్రెడిషనల్ వేర్‌లో కూడా ఆమె స్టైల్, ఎలిగెన్స్ ఎలా ఉంటాయో మరోసారి ఋజువైంది. పూజా హెగ్డే అంటే కేవలం గ్లామర్ కాదు, గ్రేస్ కూడా అని నెట్izens ఫీల్ అవుతున్నారు.
Read Also : Aravind Krishna: మంచు లక్ష్మి ఫ్యాషన్ షోలో మెరిసిన అరవింద్