Political parties support urban Naxalites.. PM Modi

ప‌ట్ట‌ణ న‌క్స‌లైట్లకు రాజ‌కీయ పార్టీల అండ‌: ప్ర‌ధాని మోడీ

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ నక్సలిజంపై కీలక వ్యాఖ్యలు చేశారు.అడవుల్లో నక్సలిజం క్రమంగా అంతమవుతోందని, దురదృష్టవశాత్తూ పట్టణాలు, నగరాల్లో వేగంగా పాతుకుపోతోందని అని అన్నారు. ఇది తీవ్ర ఆందోళన కలిగించే పరిణామమని వ్యాఖ్యానించారు. అయితే.. ఈ నక్సలిజానికి కొన్ని పార్టీలు వత్తాసు పలుకుతున్నాయని, ఇది దారుణమని అన్నారు.

Advertisements
ప‌ట్ట‌ణ న‌క్స‌లైట్లకు రాజ‌కీయ పార్టీల

ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్లే ఇది సాధ్యం

దేశంలో నక్సలిజం అంతిమ దశలో వుందని, గతంలో 100 జిల్లాలు నక్సలిజం వల్ల ప్రభావితం అయ్యేవని, ప్రస్తుతం ఆ జిల్లాల సంఖ్య రెండే డజన్లకి తగ్గిపోయిందని ప్రకటించారు. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఓ వైపు అడవుల నుంచి నక్సలిజాన్ని రూపుమాపుతుంటే, మరోవైపు అర్బన్ నక్సలిజం నెట్ వర్క్ వేగంగా విస్తరిస్తోందన్నారు. భారతీయ సంస్కృతిని, దేశ అభివృద్ధిని అర్బన్ నక్సల్స్ వ్యతిరేకిస్తారని మండిపడ్డారు. గతంలో అర్బన్ నక్సల్స్ ను వ్యతిరేకించిన పార్టీలే ఇప్పుడు వారికి వత్తాసు పలుకుతున్నాయని మోడీ మండిపడ్డారు.

భార‌త్ మూడ‌వ అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌

అర్బ‌న్ న‌క్స‌ల్స్‌తో కొత్త స‌వాళ్లు ఎదుర‌వుతున్న‌ట్లు ప్ర‌ధాని మోడీ తెలిపారు. ప‌ట్ట‌ణ న‌క్స‌ల్స్ వ‌ల్ల భార‌త అభివృద్ధి, వార‌స‌త్వానికి ప్ర‌మాదం ఏర్ప‌డింద‌న్నారు. మేధావి వ‌ర్గాల్లో భావ‌జాల‌ తీవ్రవాదం పెరుగుతున్న‌ట్లు చెప్పారు. భార‌త్ మూడ‌వ అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా మార‌బోతున్న‌ట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్ర‌జ‌ల ఆశ‌యాల‌ను చంపేసింద‌న్నారు. ఆ పార్టీ నుంచి ప్ర‌జ‌లు కూడా ఆశించ‌డం మానేసిన‌ట్లు తెలిపారు.

Related Posts
నేటి నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన
Chandrababu's visit to tirupathi from today

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి నుంచి రెండు రోజుల పాటు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన స్థానిక అభివృద్ధి కార్యక్రమాలు, Read more

ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల దాడి
Terrorist attack on army vehicle

ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదన ఆర్మీ అధికారులు శ్రీనగర్‌: ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం Read more

పార్కర్ సోలార్ ప్రోబ్: సూర్య పరిశోధనలో కొత్త దశ
parkar solar probe

NASA యొక్క పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుని బయటి వాతావరణం, కరోనా అనే ప్రాంతాన్ని అన్వేషించడానికి ప్రయాణిస్తున్నది. ఈ మిషన్ ద్వారా శాస్త్రవేత్తలు భూమికి దగ్గరగా ఉన్న Read more

TG10th Results: తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?
TG10th Results: తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

తెలంగాణ రాష్ట్రంలోని పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలు 2025 మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు Read more

Advertisements
×