amithsha ap

2028 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పోలవరం నీళ్లు – అమిత్ షా

రాష్ట్రాన్ని గాడిన పెట్టడంపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారని హోంమంత్రి అమిత్ షా అన్నారు. NDRF ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నష్టానికి కేంద్రం మూడింతల సాయాన్ని అందిస్తుందని తెలిపారు. కూటమి సర్కార్ ఏర్పడ్డాక రూ.3లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. 2028 నాటికి పోలవరం ద్వారా రాష్ట్రం మొత్తానికి నీరు సరఫరా అవుతుందని చెప్పారు.

Advertisements

ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే NDRF ఉంటుందని అమిత్ షా చెప్పుకొచ్చారు. మనుషుల విపత్తు నుంచి కాపాడటానికి NDA ముందు ఉంటుందని చెప్పారు. 2019 నుంచి ఏపీని ఏవిధంగా ధ్వంసం చేశారో మనమంతా‌ చూశామని తెలిపారు. చంద్రబాబు, మోదీ జోడీల నాయకత్వంలో ఏపీ మూడింతల ప్రగతి సాధిస్తుందని అన్నారు. సీఎం చంద్రబాబు పరిపాలన దక్షతతో పని చేస్తున్నారని అన్నారు. ఆరు నెలల్లో ఏపీకి మోదీ రూ. 3 లక్షల కోట్లు సాయం అందించారని తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రూ.11,440 కోట్లు సాయం కింద కేంద్రం కేటాయించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుర్తుచేశారు.

అంతకు ముందు చంద్రబాబు ప్రసంగంలో ఏపీ వెంటిలేటర్ నుంచి బయటపడినా ఇంకా పేషంట్ గానే ఉంది. ఇటీవలి కాలంలో అమరావతి, పోలవరంకు చేసిన సాయంతో ఏపీకి ఎంతో మేలు జరుగుతుంది. ఈ సహకారం ఇలా కొనసాగాలని విజ్ఞప్తి చేశారు. భారత్ గ్లోబల్ లీడర్ కావాల్సి ఉంది. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, స్పేస్ టెక్నాలజీ, డేటా సైన్స్ రంగాల్లో దృష్టి పెట్టాల్సి ఉంది. ప్రధాని మోదీ నాయకత్వంలో 2047 కల్లా భారత్ నెంబర్ వన్ అవుతుంది. ఎవరూ ఆపలేరన్నారు. గత ఆరు నెలల కాలంలో కేంద్రం ఎంతో సహకరిచిందని కీలకమైన ప్రాజెక్టుల్ని కేటాయించారని అన్నారు. పవన్ కల్యాణ్ కూడా కేంద్రం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.

Related Posts
శబరిమలకు రావొద్దని అయ్యప్ప భక్తుడి విజ్ఞప్తి
Ayyappa's appeal to the dev

శబరిమల వైపు పయనమవుతున్న అయ్యప్ప భక్తులకు ఓ అయ్యప్ప భక్తుడు వీడియో సందేశం ద్వారా ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. కేరళలోని శబరిమలలో తుఫాన్ ప్రభావంతో విస్తృతంగా వర్షాలు Read more

సికింద్రాబాద్లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
Army recruitment rally

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన అభ్యర్థుల కోసం ఇండియన్ ఆర్మీ అగ్నివీర్రా నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారికంగా ప్రకటన Read more

PM Modi: యువ‌తిపై సామూహిక అత్యాచార ఘటనపై స్పందించిన‌ ప్ర‌ధాని మోదీ
యువ‌తిపై సామూహిక అత్యాచార ఘటనపై స్పందించిన‌ ప్ర‌ధాని మోదీ

ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, వార‌ణాసిలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సందర్భంగా, ఇటీవల 19 ఏళ్ల యువతిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన గురించి ఆయన పోలీసులు మరియు కలెక్టర్‌తో Read more

త్వరలో డీఎస్సీ పోస్ట్ లు భర్తీ చేస్తాం: లోకేశ్‌
త్వరలో డీఎస్సీ పోస్ట్ లు భర్తీ చేస్తాం: లోకేశ్‌

ఆంధ్రప్రదేశ్‌లో 16,347 ఖాళీ టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో ప్రకటించారు. Read more

×