PM Modi Speaks On The India Century At NDTV World Summit

ప్ర‌పంచానికి భార‌త్ ఆశను క‌ల్పిస్తోంది: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎన్డీటీవీ నిర్వ‌హిస్తున్న స‌ద‌స్సులో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్న ప్ర‌పంచానికి భార‌త్ ఆశను క‌ల్పిస్తోంద‌ని అన్నారు. భార‌త స‌ర్కారు అసాధార‌ణ రీతిలో ప‌నిచేస్తోంద‌ని, ప్ర‌తి రంగంలోనూ వేగం పెంచిన‌ట్లు ఆయ‌న చెప్పారు. మూడ‌వ సారి తాము అధికారంలోకి రావ‌డం వ‌ల్ల భార‌త వృద్ధి రేటు వేగంగా జ‌రుగుతున్న‌ట్లు అనేక సంస్థ‌లు అంచ‌నా వేశాయ‌న్నారు.

డ‌బుల్ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌తో భార‌త్‌కు అడ్వాంటేజ్ జ‌రుగుతోంద‌ని, ఏఐ టెక్నాల‌జీతో పాటు ఆస్పిరేష‌న‌ల్ ఇండియాగా దేశం మారుతోంద‌న్నారు. దేశ ప్ర‌జ‌లు విక‌సిత్ భార‌త్ గురించి చ‌ర్చిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. జ‌న శ‌క్తితో రాష్ట్ర శ‌క్తి సాధిస్తున్న‌ట్లు ఉంద‌న్నారు. ఊహాజ‌నితంగా సంబంధాల‌ను పెంచుకోబోమ‌ని, త‌మ బంధాల‌న్నీ న‌మ్మ‌కం, విశ్వాసం మీద ఆధార‌ప‌డి ఉంటాయ‌ని ప్ర‌ధాని మోడీ తెలిపారు.

ప్ర‌జాస్వామ్య విలువ‌లు, డిజిట‌ల్ ఇన్నోవేష‌న్‌.. స‌హ‌జీవ‌నం చేయ‌గ‌ల‌వ‌ని భార‌త్ నిరూపించిన‌ట్లు ప్ర‌ధాని చెప్పారు. టెక్నాల‌జీతో స‌మ‌గ్ర‌త సాధించాల‌ని, కానీ దాన్ని నియంత్ర‌ణ‌కు, విభ‌జ‌న‌కు వాడ‌రాద‌న్న ఉద్దేశాన్ని భార‌త్ చూపించిన‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. త‌మ ప్ర‌భుత్వానికి రెస్ట్ అనేది లేద‌ని, భార‌త దేశ క‌ల‌ల‌ను నిజం చేసే వ‌ర‌కు విశ్ర‌మించ‌బోమ‌న్నారు.

ఈ కార్యక్రమానికి ముందు ఆయన సదస్సులో పాల్గొనడానికి వచ్చిన విదేశీ అతిథులను కలుసుకొన్నారు. రెండ్రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో యూకే మాజీ ప్రధాని డేవిడ్‌ కామరూన్‌, భూటాన్‌ ప్రధాని దాసో త్సేరింగ్‌ టోబ్గే, విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌, భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ మిత్తల్‌ తదితరులు పాల్గొననున్నారు.

Related Posts
ఈయూకు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు..
41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ కు ట్రంప్ సిద్ధం

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్ (ఈయూ)కు హెచ్చరికలు జారీ చేశారు. ఈయూ తమతో దారుణంగా వ్యవహరించిందని, దానిపై సుంకాలు విధించక తప్పదని పేర్కొన్నారు. Read more

బంగ్లాదేశ్‌లో హిందు దాడుల నేపథ్యంలో త్రిపురా పర్యాటక సంఘం కీలక చర్య
protest against hindu

ఇండియా, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు రోజురోజుకీ బలహీనమవుతున్నాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల వార్తలు తరచుగా వస్తున్న నేపథ్యంలో, ఈ రెండు దేశాల మధ్య పరిస్థితులు మరింత Read more

ICC జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌ను తిరస్కరించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ..
netanyahu 1

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ గాజా యుద్ధం నిర్వహణపై అంతర్జాతీయ నేరాల కోర్టు (ICC) ఆయనకు జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌ను తిరస్కరించారు. ఈ నిర్ణయాన్ని ఆయన Read more

తెలంగాణలో 10 మంది ఐపీఎస్ అధికారులు బ‌దిలీ

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో తాజాగా 10 మంది ఐపీఎస్ ఆఫీస‌ర్లు బ‌దిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. 2021, Read more