हिन्दी | Epaper

PM Modi: పాంబన్‌ బ్రిడ్జి ప్రారంభించిన మోదీ

Sharanya
PM Modi: పాంబన్‌ బ్రిడ్జి ప్రారంభించిన మోదీ

పాంబన్‌ రైల్వే బ్రిడ్జ్, దేశంలో తొలి సముద్రపైన రైల్వే వంతెనగా పేరుగాంచింది. ఇది 100 సంవత్సరాలుగా రామేశ్వరం, తమిళనాడు మధ్య రైలు రాకపోకలకు ఉపయోగపడుతూ వచ్చింది. దీనిలో నౌకలు వచ్చేటప్పుడు రెండు భాగాలుగా వంచి ఓపెన్ అయ్యే ప్రత్యేక వ్యవస్థ ఉండేది. కానీ కాలంతోపాటు దీని లోపాలు బయటపడటంతో, కేంద్రం ఆధునిక వంతెన నిర్మాణానికి ముందుకొచ్చింది.

ప్రధానమంత్రి రామేశ్వరం చేరుకుని పంబన్‌ బ్రిడ్జిని ప్రారంభించారు రిమోట్‌ ద్వారా పాంబన్‌ బ్రిడ్జిని మోదీ ప్రారంభించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఈ బ్రిడ్జిని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఆయన వర్టికల్‌ లిఫ్ట్‌ బ్రిడ్జిని ప్రారంభించగానే, వంతెన పైకి వెళ్లింది. అదే సమయంలో ఆ వంతెన కింది నుంచి ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ షిప్‌ ఆ ప్రాంతాన్ని దాటివెళ్లింది. ప్రపంచంలోనే వండర్‌ వంతెన ఇది. ప్రధాని మోదీ ప్రారంభించిన కొత్త పాంబన్‌ వెర్టికల్‌ లిఫ్ట్‌ బ్రిడ్జ్‌ దేశంలోనే తొలి ఈ రకమైన వంతెన కావడం విశేషం. ఇందులో నౌకలకు దారి ఇవ్వడం కోసం మధ్యభాగాన్ని పైకి లిఫ్ట్ చేసే అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించారు.

కొత్త పాంబన్‌ బ్రిడ్జ్‌ ప్రత్యేకతలు

  • పొడవు- 2.08 కిలోమీటర్లు
  • వెర్టికల్ లిఫ్ట్ పొడవు- 72.5 మీటర్లు
  • ఎత్తు- లిఫ్ట్ 17 మీటర్ల ఎత్తు వరకు ఎగురుతుంది
  • నిర్మాణ శైలి- స్టెయిన్‌లెస్ స్టీల్ తో నిర్మించబడింది
  • కోటింగ్- తుప్పు పట్టకుండా స్పెషల్ కెమికల్ కోటింగ్
  • ఖర్చు- రూ.535 కోట్లు
  • మరింత సురక్షితమైన నిర్మాణం- భారీ నౌకలు సైతం సులభంగా వెళ్లగలుగుతాయి

పాంబన్‌ ప్రాంతం రామాయణ ఇతిహాసంతో కూడా ముడిపడి ఉంది. రామేశ్వరంలోని ధనుష్కోటీ నుంచే శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి లంకకు వెళ్లేందుకు రామసేతు నిర్మించాడు. ఈ ప్రాంతం శ్రీరాముని పాదస్పర్శతో పవిత్రమైన ప్రాంతంగా భావించబడుతుంది. ఇక్కడి ఆలయాలు, తీర్థస్నానాలు భక్తులతో నిండిపోతుంటాయి. అలాంటి ప్రదేశానికి అత్యాధునిక వంతెన రూపంలో కొత్త జీవం రావడం గొప్ప విషయం. ఈ ప్రాజెక్ట్‌ ఇండియన్ రైల్వే మినిస్ట్రీ, ప్రత్యేకించి సదరన్ రైల్వే పరిధిలో జరిగింది. వందేళ్ల సేవల తరువాత పాత వంతెనను ప్రతిష్టాత్మకంగా నూతనంగా నిర్మించడం, అది కూడా అత్యాధునిక వెర్టికల్ లిఫ్ట్ సాంకేతికతతో చేయడం భారత రైల్వేల సామర్థ్యానికి నిదర్శనం. ఈ వంతెనతో రామేశ్వరం పర్యాటకానికి ఊతం కలగనుంది. భక్తులు, పర్యాటకులు, మత్స్యకారులు, వ్యాపారదారులు – అందరికీ సులభ, వేగవంతమైన ప్రయాణ మార్గం అందుతుంది. పంబన్ బ్రిడ్జ్ రాత్రి సమయంలో ప్రత్యేక లైటింగ్‌తో కూడి, ఒక దృశ్య కవితగా మారుతుంది. పాంబన్‌ బ్రిడ్జ్‌ ఒక వంతెన మాత్రమే కాదు అది భారత సాంకేతిక విజ్ఞానం, ఆధ్యాత్మిక వారసత్వం, పర్యాటకాభివృద్ధి, ప్రజల జీవనశైలిలో మార్పుకి చిహ్నంగా నిలుస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా ప్రారంభించబడిన ఈ బ్రిడ్జ్, భవిష్యత్ భారత్ నిర్మాణానికి ఒక మెరుగైన సూచికగా నిలుస్తుంది.

Read also: Ayodhya: శ్రీరామ నవమి సందర్బంగా అయోధ్యలో అదిరిపోయే ఘట్టం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డీఎంకేను ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధం: టీవీకే చీఫ్ విజయ్

డీఎంకేను ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధం: టీవీకే చీఫ్ విజయ్

హర్ముజ్ జలసంధిలో భారత్‌ ట్యాంకర్లకు లైన్ క్లియర్!

హర్ముజ్ జలసంధిలో భారత్‌ ట్యాంకర్లకు లైన్ క్లియర్!

పశ్చిమాసియాలో ఆరోగ్య సంక్షోభం: WHO డైరెక్టర్ జనరల్ ఆందోళన

పశ్చిమాసియాలో ఆరోగ్య సంక్షోభం: WHO డైరెక్టర్ జనరల్ ఆందోళన

ఇకపై ‘గ్రోక్’ ఏఐ ఉచితం కాదు.. మస్క్ కీలక నిర్ణయం!

ఇకపై ‘గ్రోక్’ ఏఐ ఉచితం కాదు.. మస్క్ కీలక నిర్ణయం!

బంగ్లాదేశ్‌లో ఇంధన సెగ.. యూనివర్సిటీలకు సెలవులు

బంగ్లాదేశ్‌లో ఇంధన సెగ.. యూనివర్సిటీలకు సెలవులు

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

గల్ఫ్ దేశాల నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులు

గల్ఫ్ దేశాల నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులు

యూజర్లకు ఆపిల్ బిగ్ షాక్.. 15 డివైస్‌లు నిలిపివేస్తూ నిర్ణయం

యూజర్లకు ఆపిల్ బిగ్ షాక్.. 15 డివైస్‌లు నిలిపివేస్తూ నిర్ణయం

బెంగాల్‌లో మారుతున్న వాతావరణం

బెంగాల్‌లో మారుతున్న వాతావరణం

గ్యాస్ సంక్షోభంపై కేంద్రం కీలక ప్రకటన

గ్యాస్ సంక్షోభంపై కేంద్రం కీలక ప్రకటన

భారత్‌లో iQOO Z11x 5G విడుదల.. ధర, ఫీచర్లు ఇవే

భారత్‌లో iQOO Z11x 5G విడుదల.. ధర, ఫీచర్లు ఇవే

కొవిడ్ టీకా మరణాల పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

కొవిడ్ టీకా మరణాల పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

📢 For Advertisement Booking: 98481 12870