తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటనకు గుర్తుగా నిలిచిన కోటా శ్రీనివాసరావు మృతిపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన “కోట గారి మృతి మన దేశానికి, ముఖ్యంగా తెలుగు సినిమాకు తీరనీయ నష్టం” అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
మోదీ స్పందన: కోటా గారి జీవితాన్ని ప్రశంసిస్తూ
ప్రధాని మోదీ (PM Narendra Modi) తన సంతాప సందేశంలో ఇలా పేర్కొన్నారు. కోటా శ్రీనివాస్‌రావు మరణం చాలా బాధాకరమని అన్నారు. ఆయన సినీ ప్రతిభ (His film talent), బహుముఖ ప్రజ్ఞకు గుర్తుండిపోతారన్నారు. కోటా శ్రీనివాస్ రావు తన అద్భుతమైన నటనతో తరతరాలుగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారని మోదీ అన్నారు. సామాజిక సేవలో కూడా ఆయన ఎప్పుడూ ముందంజలో ఉన్నారని మోదీ తెలిపారు. పేద, అణగారిన వర్గాలకు సాధికారత కోసం ఆయన ఎంతగానో కృషి చేశారని మోదీ తెలిపారు.
నటుడిగా కోట గారి అసాధారణ ప్రస్థానం
కాగా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాస్ రావు ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. తన అద్భుతమైన నటనతో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న కోటా శ్రీనివాస్ రావు సుమారు 750కిపై సినిమాట్లో నటించాడు. ఆయన నటనకు గాను 2015లో కోట శ్రీనివాసరావుకు పద్మశ్రీ పురస్కారం వరించింది. ఇదే కాకుండా ఆయనకు మరో 9 నంది అవార్డులు కూడా వచ్చాయి .
Read hindi news hindi.vaartha.com
Read also My Baby Movie: ఈ నెల 18న విడుదల అవుతున్న ‘మై బేబీ’ మూవీ