condoled the death of sm krishna

ఎస్ఎం కృష్ణ మృతిపట్ల ప్రధాని, చంద్రబాబు సంతాపం..

న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ (92) కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన వృద్ధాప్యం రిత్యా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం తెల్లవారు జామున బెంగళూరు సదాశివనగర్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఎంఎం కృష్ణ 1999 – 2004 మధ్య కర్ణాటక సీఎంగా పనిచేశారు. యూపీఏ హయాంలో 2009- 2012 మధ్య విదేశాంగ మంత్రిగానూ ఎస్ఎం కృష్ణ పనిచేశారు. దాదాపు 50ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎస్ఎం కృష్ణ.. 2017లో బీజేపీలో చేరారు. గతేడాది రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

కాగా.. ఎస్ఎం కృష్ణ మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఎస్ఎం కృష్ణ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఆయన అసాధారణ నేత. తన జీవితాంతం ఇతరుల కోసం పాటుపడ్డారు. కర్ణాటక సీఎంగా ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి. ప్రత్యేకంగా మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన ఎక్కువ శ్రద్ద చూపేవారు. ఎస్ఎం కృష్ణలో గొప్ప పాఠకుడు, ఆలోచనాపరుడు ఉన్నారని ప్రధాని మోడీ కొనియాడారు.

మరోవైపు ఎస్ఎం కృష్ణ మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయకుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎస్ఎం కృష్ణ మరణ వార్త బాధించిందని అన్నారు. పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో స్నేహపూర్వకంగా పోటీపడేవాళ్లం అని కృష్ణతో గత అనుభవాలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ప్రజల సంక్షేమానికి ఎప్పుడూ ప్రాధాన్యతనిచ్చే నిజమైన నాయకుడు ఎస్ఎం కృష్ణ. కష్ట సమయంలో ఆయన కటుంబ సభ్యులు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Related Posts
త్రివేణి సంగమంలో 48 కోట్ల మంది పుణ్యస్నానాలు
త్రివేణి సంగమంలో 48 కోట్ల మంది పుణ్యస్నానాలు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ లో జరుగుతున్న మహాకుంభమేళా లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాల కోసం భక్తులు Read more

మూవీ జాకీని (ఎంజే) పరిచయం చేసిన పివిఆర్ ఐనాక్స్ ..
PVR Inox introduced Movie Jockey MJ

పివిఆర్ ఐనాక్స్ లిమిటెడ్ మూవీ జాకీని (ఎంజే)ని ప్రారంభించింది. ఇది మూవీని కనుగొనడాన్ని మరియు భారతదేశంవ్యాప్తంగా ఉన్న మూవీ ప్రేమికులకు బుక్కింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి మరియు వ్యక్తిగతం Read more

ఢిల్లీలో గ్యాంగ్‌స్టర్లు తిరుగుతున్నారు: కేజ్రీవాల్

ఢిల్లీ శాంతిభద్రతలపై నేను యోగి జీతో ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే, దేశ రాజధానిలో శాంతిభద్రతలు కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తాయి. 11 మంది గ్యాంగ్‌స్టర్లు మొత్తం ఢిల్లీని స్వాధీనం Read more

చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి రూ.300 కోట్లు విడుదల
Rs. 300 crore released for Chakali Ilamma University

హైదరాబాద్‌: తెలంగాణ వీరనారిగా పిలువబడే చాకలి ఐలమ్మ పేరిట గల కోఠిలోని మహిళా యూనివర్సిటీ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఆ Read more