పాక్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు..

పాక్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు..

ఐసీసీ టోర్నీలలో టీమిండియా పాకిస్థాన్‌ను ఎదుర్కొన్నప్పుడల్లా క్రికెట్ అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంటుంది. ఇటీవల జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 మ్యాచ్‌లో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. విరాట్‌ కోహ్లీ తన శతకంతో మరోసారి ఆకట్టుకున్నా, పాకిస్థాన్‌పై అత్యధిక పరుగులు చేసిన టాప్‌ 5 బ్యాటర్ల జాబితాలో మాత్రం ఆయన పేరు లేకపోవడం ఆశ్చర్యకరం. మరి, ఆ లిస్ట్‌లో ఎవరున్నారో ఒకసారి పరిశీలిద్దాం. పాకిస్థాన్‌పై అత్యధిక పరుగులు చేసిన టాప్‌ 5 బ్యాటర్లు ఐసీసీ టోర్నీల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అత్యుత్తమ ప్రదర్శన చేసినా, మొత్తం ఓవరాల్‌ రికార్డుల పరంగా టాప్ 5 బ్యాటర్ల లిస్ట్‌లో కనిపించలేదు.

Advertisements
India vs Pakistan 1

సచిన్‌ టెండూల్కర్‌: పాకిస్థాన్‌తో 1989 నుంచి 2012 మధ్య కాలంలో 69 మ్యాచ్‌లు ఆడాడు సచిన్‌ టెండూల్కర్‌. వాటిలో 67 ఇన్నింగ్స్‌ల్లో 40.09 యావరేజ్‌, 87.49 స్ట్రైక్‌ రేట్‌తో ఏకంగా 2526 పరుగులు సాధించాడు. వాటిలో ఐదు సెంచరీలు, 16 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్‌ 141. బౌండరీలు 294, సిక్సులు 29 ఉన్నాయి. నాలుగు సార్లు నాటౌట్‌గా నిలిస్తే, 5 మ్యాచ్‌ ల్లో డకౌట్‌ అయ్యాడు.

సౌరవ్‌ గంగూలీ: పాకిస్థాన్‌తో 1996 నుంచి 2007 మధ్య కాలంలో మొత్తం 53 మ్యాచ్‌లు ఆడాడు సౌరవ్‌ గంగూలీ. వాటిలో 50 ఇన్నింగ్స్‌ల్లో 35.14 యావరేజ్‌, 71.82 స్ట్రైక్‌ రేట్‌తో ఏకంగా 1652 పరుగులు సాధించాడు. వాటిలో 2 సెంచరీలు, 9 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్‌ 141. బౌండరీలు 161, సిక్సులు 17 ఉన్నాయి. 3 సార్లు నాటౌట్‌గా నిలిస్తే, 4 మ్యాచ్‌ ల్లో డకౌట్‌ అయ్యాడు.

రాహుల్‌ ద్రవిడ్‌ : పాకిస్థాన్‌తో 1996 నుంచి 2009 మధ్య కాలంలో మొత్తం 58 మ్యాచ్‌లు ఆడాడు రాహుల్‌ ద్రవిడ్‌. వాటిలో 55 ఇన్నింగ్స్‌ల్లో 36.51 యావరేజ్‌, 67.17 స్ట్రైక్‌ రేట్‌తో ఏకంగా 1899 పరుగులు సాధించాడు. వాటిలో 2 సెంచరీలు, 14 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్‌ 107. బౌండరీలు 157, సిక్సులు 1 ఉన్నాయి. 3 సార్లు నాటౌట్‌గా నిలిస్తే, 3 మ్యాచ్‌ ల్లో డకౌట్‌ అయ్యాడు.

మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ : పాకిస్థాన్‌తో 1985 నుంచి 2000 మధ్య కాలంలో మొత్తం 64 మ్యాచ్‌లు ఆడాడు మొహమ్మద్‌ అజహరుద్దీన్‌. వాటిలో 59 ఇన్నింగ్స్‌ల్లో 31.86 యావరేజ్‌, 67.68 స్ట్రైక్‌ రేట్‌తో ఏకంగా 1657 పరుగులు సాధించాడు. వాటిలో 2 సెంచరీలు, 9 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్‌ 101. బౌండరీలు 108, సిక్సులు 12 ఉన్నాయి. 7 సార్లు నాటౌట్‌గా నిలిస్తే, 3 మ్యాచ్‌ ల్లో డకౌట్‌ అయ్యాడు.

యువరాజ్‌ సింగ్‌: పాకిస్థాన్‌తో 2003 నుంచి 2017 మధ్య కాలంలో మొత్తం 38 మ్యాచ్‌లు ఆడాడు సచిన్‌ టెండూల్కర్‌. వాటిలో 38 ఇన్నింగ్స్‌ల్లో 42.50 యావరేజ్‌, 93.47 స్ట్రైక్‌ రేట్‌తో ఏకంగా 1360 పరుగులు సాధించాడు. వాటిలో ఒక సెంచరీ, 12 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్‌ 107(నాటౌట్‌). బౌండరీలు 146, సిక్సులు 22 ఉన్నాయి. 6 సార్లు నాటౌట్‌గా నిలిస్తే, 2 మ్యాచ్‌ ల్లో డకౌట్‌ అయ్యాడు.

కోహ్లీ, రోహిత్ లిస్ట్‌లో లేకపోవడానికి కారణం?

2009 ముంబై ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్‌లు చాలా తగ్గిపోయాయి. ప్రస్తుతం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే కోహ్లీ, రోహిత్‌కు పాకిస్థాన్‌తో తలపడే అవకాశం వస్తోంది. ఒక వేళ ద్వైపాక్షిక సిరీస్‌లు జరుగుతూ ఉంటే, ఈ ఇద్దరు స్టార్ బ్యాటర్లు కూడా ఈ లిస్ట్‌లో ఉండేవారు.

భారత్-పాకిస్థాన్ క్రికెట్ అంటే కేవలం మ్యాచ్‌ కాదు, అది ఎప్పుడూ సెన్సేషన్. కోహ్లీ, రోహిత్ లాంటి క్రికెటర్లు ఐసీసీ టోర్నీల్లో తమదైన ముద్ర వేశారు. అయితే ఓవరాల్ స్టాటిస్టిక్స్‌లో చూసుకుంటే, టాప్ 5 బ్యాటర్లలో ప్రాచీన దిగ్గజాల పేర్లే ఉంటాయి.

Related Posts
యోగ్ రాజ్ పై టీమిండియా సంచల కామెంట్స్
యోగ్‌రాజ్ సింగ్ పై సంచలన కామెంట్స్ చేసిన టీమిండియా

భారత క్రికెట్ దిగ్గజం,మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఇటీవల యోగ్‌రాజ్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు.యోగ్‌రాజ్ సింగ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, కెపిల్ Read more

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు భారీ ప్రైజ్ మనీ?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రైజ్ మనీ వివరాలు

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు మరియు న్యూజిలాండ్ జట్టు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ యొక్క తుది Read more

ఇంగ్లండ్ సిరీస్ నుంచి ఔట్
ఇదెక్కడి అన్యాయం బ్రో ఇంగ్లండ్ సిరీస్ నుంచి ఐదుగురు ఔట్

India vs England ODI Series: ఫిబ్రవరి 6 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య మూడు వన్డే మ్యాచులు జరుగనున్నాయి. ఇది ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత Read more

న్యూజిలాండ్, ఇండియా సెమీస్‌కు
న్యూజిలాండ్, ఇండియా సెమీస్‌కు

పాకిస్థాన్‌లో జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీ ప్రస్తుతం కీలక దశలో ఉంది. గ్రూప్-బీ మ్యాచ్‌లు ముగిసినప్పటికీ గ్రూప్-ఏలో ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండటం వల్ల సెమీ ఫైనల్ Read more

×