లండన్ (London) సౌతెండ్ ఎయిర్‌పోర్టులో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. ‘బీచ్ B200 సూపర్ కింగ్ ఎయిర్’ అనే చిన్న ప్రయాణికుల విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కుప్పకూలింది. లండన్ నుంచి నెదర్లాండ్స్‌లోని లేలిస్టాడ్ నగరానికి వెళ్లే దారిలో ఈ విషాదకర ఘటన జరిగింది. సాంకేతిక లోపమే కారణమా? లేక వాతావరణ పరిస్థితులే కారణమా? అనే దానిపై విచారణ జరుగుతోంది.
విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేత
ప్రమాదం నేపథ్యంలో వెంటనే సౌతెండ్ విమానాశ్రయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. విమానం కుప్పకూలిన ప్రాంతాన్ని చుట్టూ బలమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆ విమానాశ్రయం నుంచి ఇతర విమానాల రాకపోకలపై కూడా ప్రభావం పడింది. అగ్నిమాపక దళాలు, అత్యవసర వైద్య బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.
యాత్రికుల పరిస్థితిపై క్లారిటీ లేదు
ఈ విమానం సుమారు 12 మీటర్ల పొడవుండి, 20 మంది ప్రయాణికులను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంది. అయితే ప్రమాద సమయంలో విమానంలో ఎంతమంది ఉన్నారు? ఎవరైనా గాయపడ్డారా? మరణించారా? అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. అధికారులు ప్రమాదానికి గల పూర్తి కారణాన్ని త్వరలో వెల్లడించనున్నట్టు తెలిపారు. ప్రయాణికుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
Read Also : Amaravathi : రూ.1000 కోట్లతో APలో BITS పిలానీ క్యాంపస్ – బిర్లా