plane collides with chopper midair in washington

ఢీకొన్న విమానం-హెలికాప్టర్..

వాషింగ్టన్‌: అమెరికాలోని వాషింగ్టన్ లోని రొనాల్డ్ రీగన్‌ విమానాశ్రయం సమీపంలో ఓ విమానం పొటోమాక్ నదిలో కుప్పకూలింది. పీఎస్‌ఏ ఎయిర్‌లైన్స్‌కు చెందిన చిన్న విమానం గాలిలో ఓ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రాణనష్టంపై ఎలాంటి సమాచారం లేదు. కానీ కొందరు ప్రయాణికులు మాత్రం గాయపడ్డట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే విమానంలో 60 మంది ప్రయాణికులు ఉన్నట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరగడంతో రొనాల్డ్‌ రీగన్‌ ఎయిర్‌పోర్టు నుంచి పలు విమానాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. వాషింగ్టన్‌ సమీపంలోని రోనాల్డ్‌ రీగన్‌ నేషనల్‌ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

పీఎస్‌ఏ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో కాన్సాస్‌లోని విషిటా నుంచి బయల్దేరింది. రోనాల్డ్‌ రీగన్‌ ఎయిర్‌పోర్టులో దిగేందుకు సిద్ధమవుతుండగా.. రక్షణ శాఖకు చెందిన సికోర్‌స్కీ హెచ్‌-60 బ్లాక్‌హాక్‌ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. దీంతో భారీ శబ్ధంతో అవి రెండూ నదిలో కుప్పకూలాయి. అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఆ విమానాన్ని పీఎస్‌ఏ నిర్వహిస్తున్నది. సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రయాణికుల కోసం నదిలో గాలిస్తున్నారు.

Related Posts
హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్..!
KTR Quash Petition in High Court.

హైదరాబాద్‌: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఫార్ములా ఈ-కార్ రేసింగ్ లో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌ తనపై Read more

MEA నివాస సముదాయంలో IFS అధికారి ఆత్మహత్య
IFS officer commits suicide

దేశ రాజధాని ఢిల్లీలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. విదేశీ వ్యవహారాల శాఖ (MEA) నివాస సముదాయంలో ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి జితేంద్ర రావత్ ఆత్మహత్య Read more

CM Revanth Reddy: నేడు వారికి కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు
Today they will receive compassionate employment letters.

CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ శాఖలో కారుణ్య నియామకాలు చేపడతారు. మొత్తం 582 మంది Read more

సంక్రాంతి సెలవులను తగ్గించిన ఏపీ సర్కార్
sankranthi holidays school

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు సంక్రాంతి సెలవులపై షాక్ ఇచ్చింది. మార్చిలో పబ్లిక్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో, సాధారణంగా ఇచ్చే సెలవుల్ని కేవలం మూడు రోజులకు Read more