plane collides with chopper midair in washington

ఢీకొన్న విమానం-హెలికాప్టర్..

వాషింగ్టన్‌: అమెరికాలోని వాషింగ్టన్ లోని రొనాల్డ్ రీగన్‌ విమానాశ్రయం సమీపంలో ఓ విమానం పొటోమాక్ నదిలో కుప్పకూలింది. పీఎస్‌ఏ ఎయిర్‌లైన్స్‌కు చెందిన చిన్న విమానం గాలిలో ఓ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రాణనష్టంపై ఎలాంటి సమాచారం లేదు. కానీ కొందరు ప్రయాణికులు మాత్రం గాయపడ్డట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే విమానంలో 60 మంది ప్రయాణికులు ఉన్నట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరగడంతో రొనాల్డ్‌ రీగన్‌ ఎయిర్‌పోర్టు నుంచి పలు విమానాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. వాషింగ్టన్‌ సమీపంలోని రోనాల్డ్‌ రీగన్‌ నేషనల్‌ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

పీఎస్‌ఏ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో కాన్సాస్‌లోని విషిటా నుంచి బయల్దేరింది. రోనాల్డ్‌ రీగన్‌ ఎయిర్‌పోర్టులో దిగేందుకు సిద్ధమవుతుండగా.. రక్షణ శాఖకు చెందిన సికోర్‌స్కీ హెచ్‌-60 బ్లాక్‌హాక్‌ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. దీంతో భారీ శబ్ధంతో అవి రెండూ నదిలో కుప్పకూలాయి. అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఆ విమానాన్ని పీఎస్‌ఏ నిర్వహిస్తున్నది. సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రయాణికుల కోసం నదిలో గాలిస్తున్నారు.

Related Posts
తిరుమల బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి
tirumala brahmotsavam 2024

తిరుమల బ్రహ్మోత్సవాల ప్రారంభం ముందు అపశ్రుతి చోటు చేసుకుంది. ధ్వజస్తంభంపై ఇనుప కొక్కి విరిగింది. సాయంత్రం నిర్వహించే ధ్వజారోహణలో ధ్వజస్తంభంపై గరుడ పతాకాన్ని ఈ కొక్కి ద్వారానే Read more

కోచింగ్ సెంటర్లకు కొత్త నియమాలు..
images 1 1

ప్రభుత్వం కోచింగ్ పరిశ్రమల పై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ కోచింగ్ సెంటర్ లు తరచూ అద్భుతమైన హామీలతో విద్యార్థులను మభ్యపెడుతున్నాయి . దాని కారణంగా Read more

న్యూఢిల్లీ లోని ఎర్రకోట ప్రాంగణంలో స్వాతంత్య్ర దినోత్సవం
న్యూఢిల్లీ లోని ఎర్రకోట ప్రాంగణంలో స్వాతంత్య్ర దినోత్సవం

భారతదేశంలో రెండు ప్రధాన జాతీయ పండుగలు మనకు ఎంతో గొప్ప ప్రేరణనిచ్చే రోజులు – ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం మరియు జనవరి 26 గణతంత్ర దినోత్సవం. Read more

జేసీకి బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్
జేసీకి బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వివాదం చెలరేగింది. నటి, బీజేపీ నేత మాధవీలతపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *