Piyush Goyal key comments on China trade policy

Piyush Goyal : చైనా వాణిజ్య విధానంపై పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు

Piyush Goyal : కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ ప్రపంచ వాణిజ్యంలో చైనా ఆధిపత్యం పెరుగుతుండటంపై గోయల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..కీలక వ్యాఖ్యలు చేశారు. అన్యాయమైన వాణిజ్య పద్ధతులను ఉపయోగించి చైనా ఆర్థికవృద్ధిని సాధిస్తోందని ఆరోపించారు. ధరల వక్రీకరణ, అస్పష్ట సబ్సిడీలు, ప్రపంచ వాణిజ్య నిబంధనలను ఉల్లంఘించే కార్మిక పద్ధతులు బీజింగ్‌ వృద్ధికి కారణమన్నారు.

Advertisements
చైనా వాణిజ్య విధానంపై పీయూష్

భారత్ వంటి ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం

ఇది భారత్ వంటి ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. వీటి పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే.. ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఈసందర్భంగా ప్రపంచ వాణిజ్య నిబంధనల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఇక, ఈ సందర్భంగా గోయల్ యూపీఏపై పలు ఆరోపణలు చేశారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ కాలంలో భారత్‌- చైనాల మధ్య వాణిజ్య లోటు సాధారణంగా ఉందన్నారు. అయితే, యూపీఏ హయాంలో అది 25 రెట్లు పెరిగిందని ఆరోపించారు.

వాణిజ్య యుద్ధానికి, ఆర్థిక వ్యవస్థల మందగమనానికి దారితీయొచ్చు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ బీజింగ్‌లోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్‌ చైనాతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అది మమ్మల్ని ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ ఒప్పందం తర్వాత భారత్‌లోకి వచ్చిన అనేక డ్రాగన్‌ ఉత్పత్తులపై సుంకాలు గణనీయంగా తగ్గాయి. ఇది మన స్థానిక ఉత్పాదక రంగాలపై తీవ్ర ప్రభావం చూపించింది. మనం పూర్తిగా చైనాపై ఆధారపడేలా చేసింది అని గోయల్‌ పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన ప్రతీకార సుంకాలకు చైనా కూడా అగ్రరాజ్యం ఉత్పత్తులపై టారిఫ్‌లు విధించింది. దీంతో వాణిజ్య యుద్ధానికి, ఆర్థిక వ్యవస్థల మందగమనానికి దారితీయొచ్చనే ఆందోళనలు ప్రపంచ స్టాక్‌మార్కెట్లను వణికించాయి.

Read Also : విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్

Related Posts
Kodali Nani : కొడాలి నాని ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌.. ముంబ‌యికి త‌ర‌లింపు !
Important announcement on Kodali Nani health.. Transfer to Mumbai!

Kodali Nani: ఈ నెల 26న వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కోడాలి నాని హార్ట్ ఎటాక్‌ కు గురైన విషయం తెలిసిందే. ఈ మేరకు Read more

Pawan Kalyan: మరో 15 ఏళ్లు చంద్రబాబే సీఎం : పవన్ కల్యాణ్
Pawan Kalyan మరో 15 ఏళ్లు చంద్రబాబే సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan: మరో 15 ఏళ్లు చంద్రబాబే సీఎం : పవన్ కల్యాణ్ రాష్ట్రానికి మరో 15 ఏళ్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని డిప్యూటీ సీఎం Read more

కుంభమేళాలో తొక్కిసలాట..
Maha Kumbh Mela Stampede

మహా కుంభమేళాలో విషాదం చోటుచేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానం చేసేందుకు లక్షలాది మంది భక్తులు సంగమం వద్దకు చేరుకున్నారు. అనూహ్యంగా పెరిగిన భక్తుల తాకిడికి బారికేడ్లు Read more

ఎమ్మెల్యే కొలికపూడిపై చంద్రబాబు సీరియస్
TDP High command Serious On

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై టీడీపీ అధిష్ఠానం సీరియస్ గా ఉంది. ఇటీవల ఆయన ఓ ఎస్టీ మహిళపై దాడి చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×