అమెరికాలో మినియాపోలిస్ విమానాశ్రయంలో (At the airport) ఒక విచిత్రం జరిగింది. ఈసారి విమానం ఆలస్యం కావడానికి వాతావరణం కాదు, సాంకేతిక లోపాలు కూడా కాదు. ఆశ్చర్యంగా, రెండు పావురాలే (Two pigeons) మొత్తం ప్రయాణాన్ని జాప్యం చేశాయి!విస్కాన్సిన్ వెళ్లే డెల్టా ఎయిర్ లైన్స్ (Delta Airlines)ఫ్లైట్ 2348 బోర్డింగ్ మొదలైంది. అంతలో ఒక పావురం అకస్మాత్తుగా క్యాబిన్‌లోకి దూసుకొచ్చింది. ప్రయాణికులు షాక్ అయ్యారు. పావురం ఎగిరిపడుతూ క్యాబిన్‌లో గందరగోళం సృష్టించింది.ఒక ప్రయాణికుడు వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశాడు. మరో ప్రయాణికుడు తన జాకెట్‌తో పావురాన్ని పట్టాలన్నాడు. కానీ అది ప్రయాణికుల తలల మీద ఎగిరిపోవడం మొదలుపెట్టింది! చివరకు, గ్రౌండ్ సిబ్బంది వచ్చి పావురాన్ని బయటకు పంపారు.

చిన్నారి ప్రశ్న – పావురాన్ని ముట్టుకోవచ్చా?
ఒక చిన్నారి అమాయకంగా “పావురాన్ని ముట్టుకోవచ్చా?” అని అడగడం అందరినీ నవ్వులలో ముంచెత్తింది. ప్రయాణికులు చప్పట్లు కొడుతూ సిబ్బందిని అభినందించారు.అయితే, కథ ఇక్కడితో ముగియలేదు. విమానం బయలుదేరే సమయంలో మరో పావురం లోపలికి వచ్చింది. పైలట్ మళ్లీ విమానాన్ని గేటుకి తీసుకొచ్చాడు. టామ్ కా అనే ప్రయాణికుడు దీనిని వీడియో తీసి షేర్ చేశాడు.
పైలట్-కంట్రోల్ టవర్ సంభాషణ
మళ్లీ గేటుకి వస్తున్నాం… రెండో పావురం! అని పైలట్ టవర్‌కి చెప్పాడు. అధికారులు కూడా ఇలాంటి పరిస్థితే మొదటిసారని తెలిపారు. టామ్ కా సరదాగా – ఆ రాత్రి పైలట్‌కి రెండో పావురం అని కామెంట్ చేశాడు.బ్యాగేజీ హ్యాండ్లర్లు రంగంలోకి దిగి రెండో పావురాన్ని కూడా సురక్షితంగా పంపారు. ఈ రెండు పావురాలకూ ఎలాంటి హాని జరగలేదు.
డెల్టా స్పందన – క్షమాపణలు, అభినందనలు
డెల్టా ఎయిర్ లైన్స్ ఈ సంఘటనపై స్పందించింది. ప్రయాణికులు, సిబ్బంది చూపిన సహనానికి ధన్యవాదాలు అని తెలిపింది. అలాగే ఆలస్యం జరిగినందుకు క్షమాపణలు తెలిపింది. మొత్తం ఆలస్యం 56 నిమిషాలు జరిగింది.
మాడిసన్‌కి సేఫ్ జర్నీ
(Delta Airlines), ఈ ఫ్లైట్ చివరికి 119 మంది ప్రయాణికులు, 5 మంది సిబ్బందితో మాడిసన్‌కి సురక్షితంగా చేరుకుంది.”బహుశా పావురాలు ఎగరలేక, స్నాక్స్ కోసం వచ్చాయేమో!” అని టామ్ కా సరదాగా అన్నారు. “కానీ డెల్టా ఈ ఫ్లైట్‌లో స్నాక్స్ ఇవ్వదని వాటికి తెలీదులే!”
Read Also : America:స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలు నిలిపివేత